కోయంబత్తూర్: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(నెట్)ను 2019–20లో నిర్వహిస్తామని ఏఐసీటీఈ తెలిపింది. ఈ ప్రవేశ పరీక్షకు కొన్ని రాష్ట్రాలు అంగీకరించనందున వచ్చే ఏడాది నెట్ ఉండకపోవచ్చని ఏఐసీటీఈ చైర్మన్ అనీల్.డి.సహస్రబుద్ధే వెల్లడించారు. నెట్ నిర్వహణపై అభ్యంతరం తెలుపుతున్న రాష్ట్రాలకు.. ఈ పరీక్ష వల్ల స్థానిక విద్యార్థులకు కలిగే లాభాల్ని వివరిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, మాతృ భాషలో విద్య అభ్యసించిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపడం కోసం స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్(ఎస్‌ఐపీ)ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2019లో నెట్ నిర్వహిస్తాం: ఏఐసీటీఈ
Published Tue, Jun 20 2017 2:58 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM
Advertisement
Advertisement