
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోసారి కరీంనగర్ చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది. కరీంనగర్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లను సిట్ అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. దీంతో అరెస్ట్‌ల సంఖ్య 53 కు చేరింది.
హైటెక్ మాస్ కాపీయింగ్‌లో వీరిద్దరూ పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. డీఈఈ పూల రమేష్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. 10 లక్షలకు డీల్ ఖరారవ్వగా, ప్రశ్నపత్రం ఇచ్చే విధంగా ఏఈఈ, డీఏవో పరీక్షల కోసం ఒప్పందం కుదిరింది. చెరో రూ.5 లక్షలకు కుదిరిన డీల్ చేసుకున్నట్లు సిట్ విచారణలో బట్టబయలైంది. మరో 50 మంది దాకా ప్రశ్నాపత్రాలు లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్ లో నిందితులు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
చదవండి: TSPSC Case: ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసి మాస్ కాపీయింగ్.
Comments
Please login to add a commentAdd a comment