management quota seats
-
యాజమాన్య కోటా.. ఇక ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ సీట్లను ఇప్పటివరకు ఏ కాలేజీకి ఆ కాలేజీ సొంతంగా భర్తీ చేసుకునేవి. ఈ సీట్లను కూడా మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉన్నా.. ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే అమ్ముకుంటు న్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా భర్తీలోనూ పారదర్శకతను తీసుకొచి్చ, మెరిట్ విద్యార్థులకు మేలు చేసేందుకు ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేసేందుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని ప్రభుత్వం కోరింది. దీనిపై మండలి చేపట్టిన కసరత్తు తుది దశకు చేరిందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ నివేదికలో మండలి కొన్ని కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది. పారదర్శకత కోసమే.. రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ కోటాలో సీటు పొందిన వారిలో అర్హులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీ యింబర్స్‌మెంట్ వస్తుంది. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’కేటగిరీ కింద భర్తీ చేస్తారు. మిగిలినవి ఎన్ఆర్ఐల పిల్లలకు కేటాయించారు. యాజమాన్య కోటాలో సీటు పొందిన విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. జేఈఈ, టీజీఈఏపీ ర్యాంకు ఆధారంగా, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు వచ్చిన వారికే ఈ సీట్లు ఇవ్వాలి. ఇక సీ కేటగిరీ కింద ఎన్ఆర్ఐల పిల్లలకు సీట్లు కేటాయించాలి. అయితే, మెరిట్ లేకున్నా ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకొంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. నిజానికి కనీ్వనర్ కోటాలో ఫీజు రూ.లక్ష ఉంటే.. మేనేజ్మెంట్ కోటాలోని బీ కేటగిరీ సీటుకు మూడింతలు.. అంటే రూ.3 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు ఐదింతలు.. అంటే రూ.5 లక్షల వరకు మాత్రమే ఫీజు తీసుకోవాలి. కానీ.. మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీట్లను కాలేజీలు రూ.8 నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అంత ఫీజు చెల్లించలేని మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ సీట్లు ఎవరికి, ఎంతకు అమ్ముకొంటున్నారన్న వివరాలు కూడా బయటపెట్టకపోవటంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఈ సీట్లను భర్తీ చేయటం వల్ల నిర్ణీత ఫీజు చెల్లిస్తే మెరిట్ విద్యార్థులకే సీట్లు లభిస్తాయని, సీట్ల భర్తీ అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇవీ ప్రతిపాదనలు... » బీ, సీ కేటగిరీ సీట్లకు ప్రభుత్వమే ఫీజులు ప్రతిపాదిస్తుంది. కనీ్వనర్ కోటాకన్నా బీ కేటగిరీకి మూడు రెట్లు, సీ కేటగిరీ సీట్లకు ఐదురెట్లు అధికంగా ఫీజులు వసూలు చేయవచ్చు. దీంతో పాటు లే»ొరేటరీలు, లైబ్రరీ ఫీజులు అదనంగా వసూలు చేసుకునే అధికారం ఇవ్వాలనే సూచన చేయనున్నట్లు సమాచారం. » ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నీట్ అనుసరిస్తున్న విధానాన్నే ఇంజనీరింగ్‌లోనూ అనుసరించాలనే మరో ప్రతిపాదన చేస్తున్నారు. ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేసే ఈ ప్రక్రియ మొత్తం కనీ్వనర్ కోటా మాదిరిగా సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఫీజులు మాత్రం కాలేజీలే నిర్ణయిస్తాయని అధికారులు అంటున్నారు. -
మెరిట్ ఉన్నోళ్లకే మేనేజ్మెంట్ సీటు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల బేరసారాలకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యామండ లి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కన్వినర్ కోటా సీట్లను ఈ తరహాలో కేటాయిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను సమూలంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చలు జరిగాయి. కొన్ని కాలేజీల మేనేజ్మెంట్ల అభిప్రాయాలను అధికారులు సేకరిస్తున్నారు. కొంతమంది ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నట్టు కౌన్సిల్ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ సీట్ల భర్తీ వ్యవహారంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు మండలి అధికారులు తెలి పారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంట నే విధివిధానాలను రూపొందిస్తామన్నా రు. ప్రభుత్వం కూడా ఆన్లైన్ సీట్ల భర్తీపై పట్టుదలగా ఉందని మండలి ఉన్నతాధికారులు చెప్పారు.ఏటా రూ. కోట్ల వ్యాపారం రాష్ట్రంలో దాదాపు 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ప్రస్తుతం 70 శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. దాదాపు 38 వేల సీట్లను యాజమాన్య కోటా కింద కాలేజీలే నింపుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం 15% బీ కేటగిరీ కింద భర్తీ చేయాలి. ప్రభుత్వం నిర్ణ యించిన మేరకే ఈ కేటగిరీకి ఫీజులు వసూలు చేయాలి. వీరికి ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. అయితే, జేఈఈ, ఈఏపీసెట్, ఇంటర్ మార్కుల మెరిట్‌ను పరిగణలోనికి తీసుకోవాలి. కాలేజీలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. కౌన్సెలింగ్ తేదీలకు ముందే ఒక్కో సీటును రూ.7 నుంచి 18 లక్షల వరకూ అమ్ముకుంటున్నాయనే ఫిర్యాదులున్నాయి. ఏటా ఈ తరహా సీట్ల అమ్మకంతో రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ప్రతీ సంవత్సరం ఉన్నత విద్యామండలికి వందల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయా లని విద్యార్థి సంఘాలతోపాటు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాదే దీనిపై ఆలోచన చేసినా, కాలేజీ యాజమాన్యాలు అడ్డుకున్నట్టు తెలిసింది.ఎన్‌ఆర్‌ఐలకే సీ’కేటగిరీయాజమాన్య కోటాలో 15% ప్రవాస భారతీయులకు కేటాయిస్తారు. ఈ కోటాలో సీటు పొందే వాళ్లు ఏడాదికి 5 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలు సిఫార్సు చేసిన వాళ్లకు సీట్లు ఇవ్వడం ఇప్పటి వరకూ ఉంది. ఇక నుంచి నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలకు మాత్రమే ఈ కేటగిరీ కింద సీట్లు ఇవ్వాలనే నిబంధనను తేవాలని మండలి భావిస్తోంది. ఒకవేళ ఎన్ఆర్ఐలు లేక సీట్లు మిగిలితే... ఆ సీట్లను బీ కేటగిరీ కిందకు మార్చాలని భావిస్తున్నారు. ఏటా ఇంజనీరింగ్ సీట్ల కోసం అనేక రకాలుగా సిఫార్సులు వస్తున్నాయి. కొన్ని కాలేజీలు వీటిని తప్పించుకోవడానికి ఆన్లైన్ విధానం సరైందిగా భావిస్తున్నాయి. ఆన్లైన్ సీట్ల భర్తీని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచి్చంది. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కచ్చితంగా అమలు చేస్తాం..ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచిఅమలు చేస్తాం. సీట్ల అమ్మకానికి తెరవేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మేనేజ్మెంట్ కోటా సీట్లయినా మెరిట్ ఉన్నవాళ్లకే కేటాయించేలా చేస్తాం. – వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
వేగంగా ముగిసిన ర్యాటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ధ్రువీకరణ (ర్యాటిఫికేషన్) ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కొన్నేళ్ళతో పోలిస్తే ఈ ప్రక్రియను ఇంత వేగంగా ముగించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ర్యాటిఫికేషన్ కోసం ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రతి ఏటా కుస్తీ పడుతుంటారు. ప్రతి ప్రైవేటు కాలేజీకి కేటాయించిన సీటును నిశితంగా పరిశీలించి, ఎలాంటి అభ్యంతరాలు లేవని మండలి సభ్యులు నిర్ణయించిన తర్వాతే ఆమోదం తెలుపుతారు. ఈ కారణంగా ర్యాటిఫికేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి వరకూ కొనసాగతుంది. మండలి కార్యాలయంలో దీనికి ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తారు. రోజుకు కొన్ని కాలేజీలు చొప్పున పెద్ద ఎత్తున ఫైళ్ళతో వస్తుంటాయి. ఈసారి మాత్రం ఈ హడావుడి ఏమీ కన్పించలేదు. రాష్ట్రంలోని 150కి పైగా ప్రైవేటు కాలేజీల్లో ఉండే 25 వేల మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ఇంత వేగంగా ముగించడం, అన్నీ సక్రమమేనంటూ ధ్రువీకరించడంపై పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫిర్యాదులకు ఆధారాల్లేవా? ప్రతి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఇందులో 70 శాతం కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, ఎన్ఆర్ఐలు సిఫారసు చేసిన వారికి కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను యాజమాన్య కోటా (బి కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. అయితే వీటి విషయంలో కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. జేఈఈ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి ఇవ్వాలి. సర్టిఫికెట్లు అన్నీ సరిగ్గా ఉండాలి. బి కేటగిరీ కింద కేటాయించిన సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. అయితే కాలేజీలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టుగా ప్రతి ఏటా మండలికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఏడాది కూడా 34 కాలేజీలపై 42 ఫిర్యాదులు వచ్చి నట్టు మండలి వర్గాలే తెలిపాయి. అయితే వీటిని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీని ఎలాంటి చర్యలు తీసుకున్నది అధికారులు వెల్లడించడం లేదు. అదే సమయంలో ఆధారాలుంటే తప్ప ఫిర్యాదుల విషయంలో తామేమీ చేయలేమని అంటున్నారు. ప్రైవేటు కాలేజీలు ఖుషీ ర్యాటిఫికేషన్ ప్రక్రియ ఈసారి సజావుగా సాగిపోవడంతో ప్రైవేటు కాలేజీల యా జమాన్యాలు సంతోషంగా ఉన్నాయి. మండలికి అందిన ఫిర్యాదులన్నీ అవాస్తవమని చెబుతున్నాయి. విద్యార్థి సంఘాల పేరుతో సీట్లు డిమాండ్ చేశారని, వాటిని తిరస్కరించడం వల్లే మండలికి ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇష్టానుసారం సీట్లు అమ్ముకున్నట్టుగా ఆరోపణలున్న కాలేజీల పట్ల అధికారులు సానుకూలంగా వ్యవహరించారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సంఘాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఈడీ సోదాలు
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: టీడీపీ పెద్దల గుప్పిట్లో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న గుంటూరు జిల్లా చినకాకానిలోని ‘ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్’లో అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. ఆ అకాడమీ నిర్వహిస్తున్న ఆస్పత్రి, మెడికల్ కాలేజీల నిధులను నిబంధనలకు విరుద్ధంగా కొల్లగొట్టడంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రితోపాటు విజయవాడలో నివసిస్తున్న ఆ ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పలాపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినీమోహన్ల నివాసాలలో ఈడీ బృందాలు శుక్రవారం ఏకకాలంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. ఈనాడు రామోజీరావుకు సమీప బంధువు కూడా అయిన ఎన్ఆర్ఐ ఆస్పత్రి కోశాధికారి అక్కినేని మణి నివాసంతోపాటు విజయవాడలో ఆమె నిర్మించిన ‘అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి’లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 40 మంది ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా 8 గంటలపాటు సోదాలు నిర్వహించడం గమనార్హం. అక్కినేని మణి ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధుల మళ్లింపులో కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ అధికారులు భావిస్తున్నారు. విజయవాడ భారతీనగర్‌లోని అక్కినేని ఉమెన్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు ఎలా సమకూర్చారని ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధులను దారి మళ్లించి, ఈ ఆస్పత్రిని నిర్మించినట్టు భావిస్తున్నారు. అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి నిర్మాణ బిల్లులను ఎన్ఆర్ఐ ఆస్పత్రినిధుల నుంచి చెల్లించడం గమనార్హం. ఈ మేరకు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించి, అక్కినేని మణిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ పెద్దల పాత్రపైనా దృష్టి టీడీపీ పెద్దలు తమ అక్రమాలకు అక్షయపాత్రగా ఎన్ఆర్ఐ అకాడమీని వాడుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజ) కుటుంబం నియంత్రణలో ఎన్ఆర్ఐ అకాడమీ పాలక మండలి చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఎన్ఆర్ఐ ఆస్పత్రికి అనుబంధంగా ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఆలపాటి రాజ, ఆయన సతీమణి కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధుల మళ్లింపు వ్యవహారం వెనుక వీరి కుటుంబం పాత్రపైనా ఈడీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వైద్య పరికరాల కొనుగోలు పేరిట కూడా నిధులు నొక్కేసినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరించిన తన సోదరుడు రవి ద్వారా రాజా ఈ వ్యవహారాలు సాగించినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబుకు సన్నిహితుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి చేతిలో ఎన్ఆర్ఐ అకాడమీ రిమోట్ కంట్రోల్ ఉందన్నది బహిరంగ రహస్యం. ఈ అకాడమీలో అక్రమాలపై కేసులు నమోదైన నేపథ్యంలో సుజనా చౌదరి వ్యూహాత్మకంగా తన సన్నిహితుడిని ఆస్పత్రిలో కీలక స్థానంలో చేర్చారు. ఆయన ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నిధులు దారి మళ్లించారు. కీలక ఆధారాలను ధ్వంసం చేసేందుకు కూడా యత్నించారని తెలుస్తోంది. కంప్యూటర్లలో హార్డ్ డిస్క్‌లను గల్లంతు చేసినట్టు సమాచారం. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి, డైరెక్టర్లు, ఇతర కీలక వ్యక్తుల నివాసాల్లో ఈడీ అధికారులు శనివారం కూడా సోదాలు కొనసాగిస్తారని సమాచారం. కాగా తాజా సోదాలపై ఈడీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. సీట్ల పేరిట భారీగా వసూలు చినకాకానిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రితోపాటు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పాల శ్రీనివాసరావు, నళిని మోహన్ నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో కూడా నిధుల మళ్లింపునకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర సంస్థలకు మళ్లించినట్టు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరిట నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫీజులు వసూలు చేసినట్టు కూడా ఈడీ గుర్తించింది. 2020–21లో ఆస్పత్రి నిధులను ఎన్ఆర్ఐ పాలక మండలి సభ్యులు తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్టు కూడా ఈడీ ఆధారాలు సేకరించింది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న దాదాపు 2 వేల మంది వివరాలను కూడా ఈడీ అధికారులు అడగడం గమనార్హం. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో కొందరు ఉద్యోగులను అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ముందుగా వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, అనంతరం వారిని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి మరీ విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారని తెలిసింది. ఆ సమాచారం ఆధారంగానే కొందరు ఆస్పత్రి ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. -
రాయితీ తాయిలాలు తల్లిదండ్రులతో బేరాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్ల బేరం జోరుగా సాగిస్తున్నాయి. తక్కువ ర్యాంకు ఉన్న వాళ్ళను గుర్తించి వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సు పేరుతో అడ్డూ అదుపు లేకుండా పిండేస్తున్నాయి. కేవలం మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకం కోసం దాదాపు అన్ని కాలేజీలు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఎంక్వైరీ కోసం వచ్చే వారికి, తల్లిదండ్రులకు ఫోన్లు చేసి.. సీట్లు అయిపోతున్నాయని చెబుతూ వల వేస్తున్నాయి. ముందే బుక్ చేసుకుంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు రాయితీ ఇస్తామంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో 35 వేల మేనేజ్మెంట్ సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లు 35 వేల వరకు ఉన్నాయి. ఈ ఏడాది వందకు పైగా కాలేజీలు మెకానికల్, సివిల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సుల సీట్లు పెంచుకున్నాయి. ఆ సీట్లకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సు చేయించాలని ఆశిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, టాప్ కాలేజీల యాజమాన్యాల వద్ద సీట్ల కోసం క్యూ కడుతున్నారు. తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ.. ఎంసెట్ ఫలితాలు వెల్లడైన మరుక్షణం నుంచే కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా ప్రజా సంబంధాల అధికారులను (పీఆర్వోలు), ఏజెంట్లను, కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకున్నాయి. వాళ్ళు 40 వేల ర్యాంకు పైన వచ్చిన విద్యార్థుల ఫోన్ నంబర్లు సంపాదించి, సీటు కోసం ఎర వేస్తున్నారు. నగర శివార్లలోని ఓ కాలేజీ ఏకంగా ఆరుగురు పీఆర్వోలను ఇందుకోసం తాత్కాలికంగా నియమించుకుంది. ప్రతి సీటుకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు కన్సల్టెన్సీలకు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకుంది. దీంతో ఏజెంట్లు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, సీట్లు అయిపోతున్నాయంటూ, ఇప్పుడే బుక్ చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. సీటు మాట్లాడేందుకు రమ్మని కాలేజీ యాజమాన్యం వద్దకు తీసుకెళ్ళి, రాయితీ ఇస్తున్నట్టుగా చూపించి అక్కడే అడ్వాన్సుగా రూ.25 వేలు కట్టిస్తున్నారు. రూ.లక్షల్లో బేరం వాస్తవానికి మేనేజ్మెంట్ కోటాలో 15% ఎన్ఆర్ఐ కోటా, 15% స్థానిక మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు భర్తీ చేయాలి. దీనికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనికి ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు కాబట్టి, ఎఫ్ఆర్సీ నిర్ధారించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి. ముందుగా జేఈఈ ర్యాంకు ఉన్నవారికి ఇవ్వాలి. ఇంకా మిగిలితే ఎంసెట్ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇవ్వాలి. యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పాటించడం లేదు. ముందే సీట్లు అమ్మేస్తున్నాయి. ప్రముఖ కాలేజీల్లో సీఎస్ఈ సీటు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది. ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజుకు ఈ డొనేషన్ అదనం అన్నమాట. ఈ మొత్తం నాలుగేళ్లకు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అవుతుంది. ఇది ఒకేసారి కడితే రాయితీ ఇస్తామంటున్నారు. ఇక ఎన్ఆర్ఐ కోటా కింద అవసరమైన అన్ని పత్రాలు కాలేజీలే సమకూర్చే ఏర్పాట్లు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఏటా 5 వేల యూఎస్ డాలర్లు తీసుకోవాలి. అంటే రూ.4 లక్షలు... నాలుగేళ్ళకు రూ.16 లక్షలు ఉంటుంది. ఇది కాకుండా ఇంకో రూ.5 లక్షలు అదనంగా బాదుతున్నారు. విద్యార్థులే దరఖాస్తు చేశారంటూ.. ఇలాముందే మాట్లాడుకున్న విద్యార్థుల పేర్లను ఉన్నత విద్యామండలికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మెరిట్ ప్రకారమే ఇచ్చామని, వాళ్ళే తమకు సీటుకోసం దరఖాస్తు చేశారని చెబుతున్నారు. ఆన్లైన్ విధానం లేకపోవడంతో ఎవరు దరఖాస్తు చేశారు? మెరిట్ పాటించారా? అనేది తెలియకుండా పోతోంది. దీంతో మేనేజ్మెంట్లు ఇష్టానుసారంగా దండుకుంటున్నాయి. మెరిట్ ఉన్నా మేనేజ్మెంట్ కోటా సీటు ఇవ్వలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల కమిటీ చైర్మన్ స్వరూప్‌రెడ్డి గతంలో పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యాలు నేరుగా తమకు దరఖాస్తు చేసినా వాటిని కాలేజీలకు పంపుతామని చెప్పింది. గత ఏడాది ఇలాంటి ఫిర్యాదులు 50 వరకు వచ్చాయి. వాళ్ళు మళ్ళీ ఏం జరిగిందనేది చెప్పలేదని ఎఫ్ఆర్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలి కన్వీనర్ కోటా మాదిరిగానే మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలి. ఈ మేరకు మేం అనేకసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విధంగా యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకునేందుకు అధికారులే అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల ప్రతిభ ఉన్న వారికి సీట్లు రావడం లేదు. – ప్రవీణ్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నియంత్రించాల్సిందే మేనేజ్మెంట్ కోటా పేరిట దోపిడీ పేదవాడికి శాపంగా మారింది. అసలు కాలేజీల్లో తనిఖీలు చేయకుండా, కాలేజీల్లో మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? చూడకుండా, బి కేటగిరీ సీట్లు అమ్ముకునే అధికారం ఎవరిచ్చారు? బహిరంగంగా సాగుతున్న ఈ అక్రమాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. – అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు సాంకేతిక కాలేజీల సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ప్రైవేట్ మెడికల్ ఫీజుల..పెంపునకు ‘నో’
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా ఫీజులను పెంచేందుకు ప్రభుత్వం నిరాకరించింది. కరోనా వేళ పెంపు సరికాదని భావించి కాలేజీల విన్నపాన్ని తిరస్క రించింది. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చేసిన ఫీజుల సవరణ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. ప్రస్తుతం ఉన్న ఫీజులనే కొనసాగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫీజులపై స్పష్టత రావడంతో వెంటనే ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటా మెడికల్ సీట్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు రకాల సిఫారసులు...: బీ, సీ కేటగిరీ ఫీజులను పెంచాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏఎఫ్ఆర్సీకి విన్నవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలు ఉండగా దీన్ని రూ. 14 లక్షల వరకు పెంచాలని కొన్ని కాలేజీలు కోరినట్లు తెలిసింది. కల్పించిన మౌలిక సదుపాయాలు, పెరిగిన ఖర్చులు తదితర వివరాలతో అకౌంట్ల సమగ్ర నివేదికలను కాలేజీలు ఏఎఫ్ఆర్సీకి సమర్పిం చాయి. కాలేజీల్లో వసతులను బట్టి, వాటి ఖర్చును బట్టి ఒక్కో కాలేజీకి ఒక్కోరకంగా ఫీజు ఉంటే బాగుంటుందని ఏఎఫ్ఆర్సీ భావించి ప్రభుత్వానికి నివేదించింది (ఈ ఏడాది పీజీ మెడికల్ మేనేజ్మెంట్ సీట్ల ఫీజును అలాగే ఖరారు చేసిన సంగతి తెలిసిందే). అలాగే రెండో ప్రతిపాదన కూడా చేసింది. ప్రస్తుతం ఉన్నట్లుగానే అన్ని కాలేజీలకు ఒకే ఫీజును కూడా నిర్ణయించవచ్చని సిఫారసు చేసింది. ఈ రెండింటిపై చర్చించిన ప్రభుత్వం ఈసారి అసలు ఫీజులను పెంచకూడదని నిర్ణయించింది. ప్రస్తుత ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారం ఈసారి కూడా బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలు వసూలు చేసుకోవచ్చు. ఇక సీ కేటగిరీలో దీనికి రెట్టింపు ఫీజు.. రూ. 23.10 లక్షల వరకు వసూలు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. సర్కారు నిర్ణయంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కంగుతిన్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజల ఆదాయాలు పడిపోవడం, ఉన్న ఫీజులే భరించలేని పరిస్థితుల్లో పెంచడం సబబు కాదనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 17 వరకు వెబ్ ఆప్షన్లు... ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన వెంటనే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలకు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్శిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు మైనారిటీ, నాన్‌న్‌మైనారిటీ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా బీ, సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ సీట్ల భర్తీకి ఆన్లైన్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికే మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. అర్హులైన అభ్యర్థులు 17వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు ఇచ్చుకోవడానికి కేవలం 48 గంటలే సమయం ఇవ్వడం గమనార్హం. కళాశాల వారీగా సీట్ల వివరాలను వర్శిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. మరింత సమాచారానికి ఠీఠీఠీ. జుnటuజిట. ్ట్ఛ ్చnజ్చn్చ. జౌఠి. జీn వెబ్‌సైట్‌ను సందర్శించాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. -
ముందే మేనేజ్ చేశారు..!
ఇంటర్లో 94% మార్కులు తెచ్చుకున్న దుష్యంత్ ఎంసెట్‌కు సిద్ధమవుతున్నప్పటికీ మంచి కాలేజీలో సీటు కోసం మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ తీసుకొనేందుకు తల్లిదండ్రులను ఒప్పించాడు. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న ఓ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)లో చేరేందుకు యాజమాన్యాన్ని సంప్రదించాడు. అయితే ఇప్పటికే మెజారిటీ సీట్లు అయిపోయాయని, ట్యూషన్ ఫీజుతోపాటు అదనంగా డొనేషన్ రూ. 12 లక్షలు చెల్లిస్తే సీటు కేటాయిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి 25% డొనేషన్‌ను అడ్వాన్స్‌గా చెల్లించి సీటు సొంతం చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు బరితెగించాయి. ఇంకా ఎంసెట్ జరగ కున్నా యాజమాన్య కోటా సీట్లను అప్ప నంగా విక్రయించేస్తున్నాయి. ఏ కాలేజీలో కటాఫ్ ఎలా ఉంటుందో తెలియకున్నా భారీ మొత్తంలో డొనేషన్లు దండుకునేందుకు యాజమాన్య కోటా సీట్లను వేలం వేస్తు న్నాయి. కరోనా నేపథ్యంలో కళాశాలలన్నీ మూతపడినప్పటికీ అంతర్గతంగా బోధన, బోధనేతర సిబ్బందితో మేనేజ్మెంట్ సీట్లను భర్తీ చేసేందుకు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే పలు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని బ్రాంచుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లన్నింటినీ నింపేశాయి. మరో పది రోజుల్లో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానుండగా... ఆలోపే సీట్లన్నీ భర్తీ చేసేలా ప్రణాళిక రచిస్తున్నాయి. ‘కరోనా’ను క్యాష్ చేసుకుంటూ... రాష్ట్రంలో 183 ఇంజనీరింగ్ కాలేజీలుండగా ఈ ఏడాది వాటిలో కొన్నింటికి ఇంకా అనుమతులు రాలేదు. దీంతో ఆ కాలేజీలు మినహాయిస్తే మిగిలిన వాటిలో 70% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుండగా మిగతా 30% సీట్లు ఆయా యాజమాన్యాలు నింపుకుంటున్నాయి. వాస్తవానికి ఈపాటికే ఎంసెట్ ముగిసి అడ్మిషన్ల కౌన్సెలింగ్ సైతం కొలిక్కి వచ్చేది. కానీ కరోనా నేపథ్యంలో ఎంసెట్ ఇంకా జరగలేదు. దీంతో 2020–21 విద్యా సంవత్సరంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో గందరగోళలం నెలకొంది. ఈ పరిస్థితిని అదనుగా చేసుకున్న కాలేజీ యాజమాన్యలు... మేనేజ్మెంట్ కోటా సీట్లను విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. సీటు కన్ఫర్మ్ చేసుకుంటే పాఠ్యాంశ బోధన ప్రారంభమవుతుందని, ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా, రాకున్నా ఇబ్బందులుండవనే కోణంలో ప్రచారం చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆకర్షితులవుతున్నారు. దండిగా డొనేషన్లు... ఇంజనీరింగ్‌లో ప్రస్తుతం సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ కోర్సులకు డిమాండ్ ఉంది. సీఎస్ఈ కోటాలో ఉన్న మేనేజ్మెంట్ సీట్లు టాప్ కాలేజీల్లో దాదాపుగా భర్తీ అయ్యాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ కోర్సుల్లో అడ్మిషన్ కోసం వచ్చే విద్యార్థులపై యాజమాన్యలు డొనేషన్ల పేరిట భారీగా దండుకుంటున్నాయి. సగటున రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. టాప్ కాలేజీలుగా పేరున్న వాటిలో రూ. 10 లక్షలకు తక్కువగా డొనేషన్ లేదు. డొనేషన్‌తోపాటు రెగ్యులర్ ట్యూషన్ ఫీజును ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చెల్లించాలి. ఈసారి కొత్తగా సీఎస్ఈలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ (డీఎస్), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కేటగిరీలకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ ఏడాది నుంచి నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ కోర్సులవైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో డిమాండ్‌కు తగినట్లు యాజమాన్యలు డొనేషన్లను వసూలు చేస్తున్నాయి. ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ బ్రాంచీలలో అడ్మిషన్‌కు రూ. 3 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులోనూ డిమాండ్‌కు తగినట్లు యాజమాన్యాలు రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి. ఎంసెట్‌లో ర్యాంకు వస్తే డబ్బు వాపస్ ఇస్తామని కూడా యాజమాన్యాలు చెబుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్ కింద కొంత మేర చెల్లించి సీట్లు రిజర్వ్ చేసుకుంటున్న వాళ్లు కూడా అధికంగా ఉన్నారు. ఆ కాలేజీల్లో ట్యూషన్ ఫీజులే... టాప్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్లకు భారీగా డొనేషన్లు డిమాండ్ చేస్తుండగా ఆ తర్వాతి వరుసలో ఉన్న కాలేజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎలాంటి డొనేషన్లు వద్దంటూ ప్రచారం చేస్తున్నాయి. బోధన, బోధనేతర సిబ్బందిని రంగంలోకి దింపి కేవలం ట్యూషన్ ఫీజు చెల్లిస్తే చాలనే నినాదంతో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఈ కాలేజీల్లోనూ సీఎస్ఈ, ఐటీ బ్రాంచీలలో సీట్ల భర్తీ ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ర్యాంకు సాధించి నచ్చిన కాలేజీలో సీటు వస్తే బుకింగ్‌కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెబుతుండటంతో విద్యార్థులు ముందస్తుగా బుకింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. ఎల్బీ నగర్‌కు చెందిన మనుశ్రీని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలని నిర్ణయించిన తండ్రి... ఘట్కేసర్ సమీపంలోని ఓ ప్రఖ్యాత కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించాడు. సీఎస్ఈలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్ బ్రాంచ్‌లో సీటు కోరగా రూ. 15 లక్షల డొనేషన్‌తోపాటు ట్యూషన్ ఫీజు భరించాల్సి వస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎంసెట్ మాక్ టెస్ట్‌లో మనుశ్రీ స్కొర్‌ను అంచనా వేసుకున్నాక ఆ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీటును కన్ఫర్మ్ చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా కొన్ని రూ. లక్షలు చెల్లించి ఎంసెట్ ర్యాంకు, సీటును బట్టి మిగతా మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. -
పీజీ మెడికల్ డెంటల్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు నీట్–2020లో అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం ఉదయం 11 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తులు https://pvttspgmed.tsche.in వెబ్సైట్లో ఉంటాయని, ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం ప్రొవిజనల్ మెరిట్ జాబితాను యూనివర్సిటీ విడుదల చేస్తుందని తెలిపింది. దరఖాస్తుకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు 9704093953, 8466924522లను సంప్రదించాలని సూచించింది. పూర్తి సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs. telangana.gov.in ను సందర్శించవచ్చని పేర్కొంది. -
మెడికల్ సీట్ల పేరుతో మోసం
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి ర్యాంక్‌లు వచ్చేలా చూడాల్సిన లెక్చరరే మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఇప్పిస్తానంటూ రూ. లక్షల్లో దండుకుని తీసుకొని మోసగించడంతో రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతడికి సహకరిస్తున్న నిర్మల్‌కు చెందిన యాగ శ్రావణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.9.45 లక్షల నగదు, వెంటో వోక్స్‌వాగన్‌కారును స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కృష్ణా జిల్లా, విసన్నపేట మండలం, పుతిరాల గ్రామానికి చెందిన అరిగే వెంకట్రామయ్య ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అనంతరం నారాయణ కాలేజీలో లెక్చరర్‌గా పని చేశాడు. కొన్ని నెలల క్రితం తానే ఎల్బీనగర్లో ఏవీఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నీట్ స్టూడెంట్స్ పేరుతో ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించాడు. అందరూ విద్యార్థులకు సీట్లు వచ్చేలా చూస్తామని, ఒకవేళ రాకున్నా మేనేజ్మెంట్ కోటాలో బీ లేదా సీ కేటగిరిలో సీట్లు ఇప్పిస్తానంటూ ఆశ చూపాడు. ఇలా పలువురు విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. తల్లిదండ్రులకు కూడా హామీ ఇవ్వడంతో నమ్మి చాలా మంది డబ్బులు చెల్లించారు. అయితే అనుకున్న స్థాయిలో ర్యాంకులు రాని విద్యార్థులు మేనేజ్మెంట్ సీట్ల విషయాన్ని ప్రస్తావిస్తే రేపుమాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. అతడి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఎల్బీనగర్కు చెందిన గదగోజు పరమేశ్ తన నుంచి రూ.17 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని సీట్లు ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎల్బీనగర్ ఎస్ఓటీ బృందం వెంకట్రామయ్య, అతని ఇనిస్టిట్యూట్‌లోని రిసెప్షనిస్ట్‌గా పనిచేసే శ్రావణి కదలికలపై నిఘా ఏర్పాటు చేసి ఎల్బీనగర్లో సోమవారం అరెస్టు చేశారు. నరేశ్, వంశీ, సత్యనారాయణల అనే మరి కొందరి నుంచి రూ. 1.40 కోట్లు తీసుకొని మోసం చేసినట్లు తేలింది. తదుపరి విచారణ కోసం నిందితులను ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. -
మెడికల్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు వైద్య కాలేజీల్లోని బీ, సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని, ఈనెల 21న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి దూర విద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
ఆన్లైన్ విధానం లేదు.. మెరిట్‌కు సీటు రాదు!
సాక్షి, హైదరాబాద్ : అది రాష్ట్రంలోని ఓ టాప్ ఇంజనీరింగ్ కాలేజీ.. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోలేదు.. అడ్డగోలు ఫీజులు వసూలు చేసి, తక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు ఇచ్చింది.. ఇదేమిటని అధికారులు ప్రశ్నిస్తే... ‘‘మాకు విద్యార్థులను ఇంటర్వ్యూ చేసే అధికారం ఉంది. వారికి ఫీజు చెల్లించే స్తోమత ఉందా లేదా తెలుసుకుని సీట్లను కేటాయించవచ్చు. అదే చేశాం.. తక్కువ ర్యాంకు ఉన్న వారికీ సీట్లు ఇచ్చాం..’’అని కరాఖండీగా చెప్పేసింది.. – మరో టాప్ కాలేజీలోనూ ఇదే పరిస్థితి. ఈ కాలేజీ ముందుగానే అడ్డగోలు రేట్లకు సీట్లను అమ్మేసుకుంది.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ సీటుకైతే ఏకంగా రూ. 12 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు వసూలు చేసింది. తక్కువ ర్యాంకులు వచ్చిన ఈ విద్యార్థులకు సీట్లు ఇచ్చింది. దీనిపై అధికారులు ప్రశ్నిస్తే.. మళ్లీ అదే సమాధానం. విచిత్రమేమిటంటే.. యాజమాన్యాలే సీట్లను బ్లాక్ చేయడంతో భారీగా ఫీజులు చెల్లించేవారు లేక చివరలో కొన్ని సీట్లు మిగిలిపోవడం గమనార్హం. ..ఈ రెండు కాలేజీలే కాదు రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలా వరకు ఇదే విధంగా వ్యవహరించాయి. ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి కాలేజీలు కూడా నిబంధనలను తుంగలో తొక్కి యాజమాన్య కోటా సీట్ల భర్తీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. మేనేజ్మెంట్ కోటా సీట్ల ర్యాటిఫికేషన్ (అధికారులు పరిశీలించి ఆమోదించే ప్రక్రియ)లో ఈ తతంగం బయటపడింది. యాజమాన్యాలు పంపించిన ఫైళ్లలో ‘మెరిట్’కనిపించకపోవడంతో అధికారులు కంగుతిన్నారు. అయితే సీట్లకు పెద్దగా డిమాండ్ లేదని, పైగా కోర్టు ఉత్తర్వుల ప్రకారమే తాము విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను చూసి సీట్లను కేటాయించామని యాజమాన్యాలు చెబుతుండటంతో.. ఏం చేయాలో తోచక మిన్నకుండిపోతున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదులు వస్తే తప్ప ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ర్యాటిఫికేషన్ చేపట్టే సిబ్బంది కూడా కాలేజీల యాజమాన్యాలతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఇంజనీరింగ్‌లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. ఇక యాజమాన్య కోటాలోని 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా.. మరో 15 శాతం సీట్లను ఎ¯న్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో విద్యార్థులకు కేటాయించాలి. మొత్తంగా ఏ సీట్లు అయినా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి.. ర్యాంకుల మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలి. ఒకవేళ దరఖాస్తు చేసుకున్న మేర జేఈఈ మెయిన్ ర్యాంకుల వారికి సీట్లు కేటాయించగా.. మిగిలితే ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లను ఇవ్వాలి. ఇలా సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. కానీ ఈ నిబంధనలను కొన్ని కాలేజీలే పాటిస్తున్నాయి. చాలా కాలేజీలు ఆన్లైన్ విధానాన్ని పాటించడం లేదు. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఉన్నత విద్యా మండలి కూడా యాజమాన్య కోటా సీట్ల కేటాయింపునకు గుడ్డిగా ఆమోదముద్ర (ర్యాటిఫికేషన్) వేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ‘ఆన్లైన్’సాధ్యంకాదా? యాజమాన్య కోటా సీట్లను పూర్తిగా ఆన్లైన్లో భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని 2017–18 విద్యా సంవత్సరం ప్రారంభంలో అధికారులు ప్రకటించారు. కానీ అమలుపై దృష్టి సారించలేదు. దీంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లను అమ్ముకున్నాయి. అసలు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఆన్లైన్లో చేపట్టడం అసాధ్యమేమీ కాదని.. కోర్టులను ఆశ్రయించి గత తీర్పులపై రివ్యూలకు వెళితే ప్రయోజనం ఉంటుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దీనివల్ల కాలేజీల యాజమాన్యాలకు నష్టం కాబట్టి.. ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూలత లభించే పరిస్థితి లేక అధికారులు నోరు మెదపడం లేదని చెబుతున్నారు. యాజమాన్య కోటా సీట్లను పారదర్శకంగా, మెరిట్ విద్యార్థులకు కేటాయించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. -
సీటుకు నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీనా?
సాక్షి, హైదరాబాద్: యాజమాన్య కోటా కింద ఉన్న 35 శాతం సీట్ల విషయంలో తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల నిర్వాకంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రైవేటు వైద్య కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెబ్సైట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో కౌన్సెలింగ్ ఫీజు, కోర్సు ఫీజు వివరాలను పొందుపరిచారు. బీ కేటగిరీ కింద ఎంబీబీఎస్‌కు ఏడాదికి రూ.9 లక్షల చొప్పున చెల్లించాలి. ఆ ప్రకారం ఐదేళ్ల కోర్సుకు రూ. 45 లక్షలు చెల్లించాలి. కౌన్సెలింగ్‌లో సీటు పొందే విద్యార్థులు మొదటి ఏడాదికి రూ. 9 లక్షలు చెల్లించడంతోపాటు మిగిలిన నాలుగేళ్లకు సంబంధించి రూ. 36 లక్షల బ్యాంకు గ్యారంటీ చూపించాలని స్పష్టంచేశారు. అలాగే బీడీఎస్ కోర్సుకు మొదటి ఏడాది రూ. 4 లక్షలు ఫీజు చెల్లించడంతోపాటు... మిగిలిన మూడేళ్లకు సంబంధించిన రూ. 12 లక్షలకు బ్యాంకు గ్యారంటీ కోరారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందుగానే కోర్సు కాలం మొత్తం ఫీజుకు గ్యారంటీ కోరడంపై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై వైద్య శాఖ అధికారులు కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిసింది. -
కన్వీనర్ కోటా ఫుల్.. మేనేజ్మెంట్ కోటా నిల్!
ఈ సారి ఇంజనీరింగ్‌లో 87,907 సీట్లు ♦ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైంది 62,777 మందే ♦ 25 వేల సీట్లు మిగిలిపోయే అవకాశం ♦ టాప్ కాలేజీల్లో మాత్రం భర్తీ కానున్న మొత్తం సీట్లు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కన్వీనర్ కోటా సీట్లు పూర్తిగా భర్తీ కానుండగా, మేనేజ్మెంట్ కోటా సీట్లు మాత్రం ఖాళీగా ఉండబోతున్నాయి. కొద్దిగా పేరున్న, టాప్ కాలేజీలు మినహా మిగితా కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారు తక్కువ సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం. ఈసారి రాష్ట్రంలోని 236 ప్రైవేటు, 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లోని 87,907 సీట్ల భ ర్తీకి ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అయితే అర్హులైన విద్యార్థులు మాత్రం 62,777 మందే ఉన్నారు. వారంతా కాలేజీల్లో చేరినా మరో 25 వేల సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన వారికి ర్యాంకులు ఇస్తే మరో 5 వేలకు మించి సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి లేదు. మరోవైపు ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే వారు 10 వేల మంది వరకు ఉండే అవకాశం ఉంది. దీంతో సాధారణ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటాలో చేరే వారి సంఖ్య పెద్దగా ఉండే అవకాశం లేదని విద్యావేత్తలు భావిస్తున్నారు. కన్వీనర్ కోటాలోనూ చేరే వారు గతేడాది కంటే తక్కువే.. కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్య గత ఏడాది కంటే ఈసారి తక్కువ ఉండే అవకాశం ఉంది. గత ఏడాది 287 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,10,634 సీట్లు అందుబాటులో ఉండగా 55,925 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. అందులో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరిన వారైతే 52,975 మంది ఉండగా, ప్రభుత్వ కాలేజీల్లో 2,950 మంది చేరారు. ఇక ఈసారి కన్వీనర్ కోటాలో 62,445 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అందులో ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లు 3,032 కాగా ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు 59,413 ఉండనున్నాయి. ఇక విద్యార్థులు 62,777 మంది ఉండగా అందు లో ఎంత మంది కాలేజీల్లో చేరుతారన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి గతేడాది కంటే ఈసారి తక్కువ మందే ఇంజనీరింగ్‌లో చేరుతారని విద్యావేత్తలు భావిస్తున్నారు.మరోవైపు ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌కోటాలో 25,462 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. పరీక్ష రాసిన వారిలో సగం మందే రాష్ట్రంలో మే 14వ తేదీన నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,28,162 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,04,373 మంది ఎంసెట్‌లో అర్హత సాధించారు. అయితే ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ కావడం, డీబార్ అవడం వంటి కారణాలతో 90,556 మంది విద్యార్థులే ర్యాంకులను పొందారు. అందులో ప్రవేశాల కోసం నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారు 62,777 మంది మాత్రమే ఉన్నారు. అంటే పరీక్షకు హాజరైన వారిలో చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకొని ఇంజనీరింగ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న వారు సగానికంటే తక్కువ మంది విద్యార్థులే. -
ఇంటర్ మార్కులతో ఎంబీబీఎస్సా?
యాజమాన్య సీట్ల భర్తీ కుదరదు: ఎంసీఐ సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్‌లో యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే ప్రయత్నాలను భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) తిరస్కరించింది. వైద్యవిద్యలో ప్రవేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆధ్వర్యంలో పరీక్ష ద్వారానే ఎంపిక జరగాలని సూచించింది. ఈ మేరకు 2013లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసినట్టు ఎంసీఐ వర్గాలు పేర్కొన్నాయి. పోస్ట్ మెట్రిక్యులేషన్ పూర్తవగానే ఎంబీబీఎస్‌లో చేరడమనేది విరుద్ధమని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. ప్రవాస భారతీయులకు 15 శాతం కోటా మినహాయించి మిగతా 85 శాతం ప్రైవేటు సీట్లను ఇంటర్ మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో భర్తీ చేయనున్నట్లు వార్తలు రావటంపై ఎంసీఐ వర్గాలు స్పందించాయి. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానంపై హెచ్చరిస్తూనే ఉన్నామని ఎంసీఐ అధికారి ఒకరు తెలిపారు. కచ్చితమైన విధివిధానాలతో ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదా ప్రైవేట్ కళాశాలలే ప్రవేశ పరీక్ష నిర్వహించుకుని యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసుకోవాలని చెప్పామన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన ఎంసీఐ నిబంధనలు మారవని స్పష్టం చేశాయి. ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు సరికాదని అధికార వర్గాలు తేల్చి చెప్పాయి. పరీక్షలు నిర్వహించుకోలేకపోవడం, సకాలంలో కౌన్సెలింగ్ చేయలేకపోవడమనేది విద్యార్థుల తప్పిదం కాదని, అది కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే అవుతుందని ఎంసీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. వివిధ రాష్ట్రాల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై విధివిధానాలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్ల భర్తీ, అకడమిక్ క్యాలెండర్ తదితర విషయాలపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు నివేదిక ఇవ్వనున్నట్టు భారతీయ వైద్యమండలి అధికారి చెప్పారు. -
కౌన్సెలింగ్ మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి నిర్వహించాలనుకున్న కౌన్సెలింగ్ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది. కొత్త కాలేజీలు, అదనపు సీట్ల పెంపునకు సంబంధించిన అనుమతుల గడువును అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మరో ఐదు రోజులు పెంచడమే ఇందుకు కారణం. ఈ గడువును ఈనెల 15 నుంచి 20 వరకు పెంచారు. దీంతో వీలైతే జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాలేజీలకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చాక, ఉభయ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు వాటికి గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ఆ కాలేజీలను కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు అనుమతిస్తారు. దీనికితోడు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి రెండు ప్రభుత్వాల నుంచి ఇంకా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కాగా, వివిధ పీజీ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, లా, పోస్టు గ్రాడ్యుయేషన్ లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇందుకు శుక్రవారం షెడ్యూలు ఖరారు చేసింది. -
కాసుల కక్కుర్తిలో నాణ్యతకు పాతర
* ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఇష్టారాజ్య విధానాలు * మొన్న ఎన్ఆర్ ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా పెంపు * ఇపుడు ఎంసెట్ లేకుండానే యాజమాన్య కోటాలో ప్రవేశాలు * ఎంసెట్‌నే ప్రశ్నార్థకం చేసే నిర్ణయం * యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు సాక్షి, హైదరాబాద్: యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఎంసెట్ మనుగడనే ప్రశ్నార్థకం చేసే నిర్ణయం తీసుకున్నారు. మొన్న ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సిఫారసు చేసిన అధికారులు.. తాజాగా మేనేజ్మెంట్ కోటా సీట్లను జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగానే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్య శాఖ అధికారులు అనుకున్నదే తడవుగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగం వెనుక భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు.. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత లేకుండాపోయింది. టాప్ కాలేజీల్లోనే ఫలితాలు 50 శాతం నుంచి 80 శాతానికి మించడం లేదు. అయినా కొన్ని ప్రముఖ కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గిన అధికారులు ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను మరింత పాతాళానికి తొక్కుతున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ప్రస్తుతం ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ఇపుడు మేనేజ్మెంట్ కోటా సీట్లను పూర్తిగా ఇంటర్మీడియెట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తే నాణ్యత మరింత దెబ్బతింటుందని, ఎంసెట్‌కు ప్రాధాన్యమే ఉండదన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం అనేక నిబంధనలు ఉన్నప్పుడే మేనేజ్మెంట్ కోటా సీట్లను బేరం పెడుతున్న ప్రముఖ కాలేజీలకు ఇక ఇంటర్మీడియెట్ మెరిట్‌తోనే యాజమాన్య కోటా సీట్ల భర్తీకి అవకాశం ఇస్తే.. సీట్లను మరింత అడ్డగోలుగా అమ్ముకుంటారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆలోచనలతోనే ముందుకొచ్చిన కొన్ని ప్రముఖ కాలేజీల యాజమాన్యాల ముడుపుల బాగోతం, ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్యా మండలి అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాల నుంచే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో పక్కా విధానం అనుసరించాలన్న కోర్టు ఆదేశాల పేరుతో యాజమాన్య అనుకూల విధానాలు తీసుకువస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా పెంపులో మరో కుట్ర ప్రస్తుతం ఐదు శాతం ఉన్న ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచడం ద్వారా సీట్లు అమ్ముకునేందుకు యాజమాన్యాలకు మరింత అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని 705 ఇంజనీరింగ్ కాలేజీల్లోనే 3,06,925 సీట్లు అందుబాటులో ఉండగా అందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తోంది. మరో ఐదు శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో భర్తీకి, 25 శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసేలా గతేడాది చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను యాజమాన్యాలు కోర్టులో సవాలు చేశాయి. దీంతో యాజమాన్యాలతో సమావేశమైన ఉన్నత విద్యామండలి యాజమాన్యాల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచాలని నిర్ణయించి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జూన్ 9న ఎంసెట్ ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రాతపరీక్ష ఫలితాలు జూన్ 9న ప్రకటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 16వ తేదీన జరగనున్న నేపథ్యంలో మే 17న నిర్వహించాల్సిన ఎంసెట్ రాతపరీక్షను అదే నెల 22వ తేదీకి వాయిదా వేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎంసెట్ కమిటీ ప్రిలిమినరీ కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, ఫలితాల వెల్లడి తేదీలనూ మార్పు చేసిందని ఎంసెట్-2014 కన్వీనర్ రమణారావు శుక్రవారం వెల్లడించారు. తొలుత మే 19న ప్రాథమిక కీ విడుదల చేసి, 26వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని, జూన్ 2న ర్యాంకులను వెల్లడించాలని నిర్ణయించారు. అయితే పరీక్ష తేదీ మారడంతో మే 24న ప్రిలిమినరీ కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను మే 31 వరకు స్వీకరిస్తారు. జూన్ 9నఎంసెట్ ఫలితాలు, ర్యాంకులను వెల్లడిస్తారు. -
డీఎడ్ సీటుకు లక్షన్నర!
యాజమాన్య కోటాలో ప్రైవేటు కాలేజీల వసూళ్లు ‘మెరిట్’కు పాతర.. ఇష్టారాజ్యంగా సీట్ల భర్తీ నియంత్రించలేకపోతున్న అధికారులు మేనేజ్మెంట్ కోటా ఫీజునే నిర్ధారించని విద్యాశాఖ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో ప్రైవేటు డీఎడ్ కాలేజీల యాజమాన్యాలు వసూళ్ల దందాకు దిగాయి. ఒక్కో సీటుకు రూ. లక్షన్నర వరకూ వసూలు చేస్తున్నాయి. ఇందుకోసం మెరిట్ ప్రకారమే సీట్ల భర్తీ చేపట్టాలన్న నిబంధనను తుంగలో తొక్కుతున్నాయి. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా.. ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. అసలు డీఎడ్ కోర్సు యాజమాన్య కోటా సీట్లకు ప్రభుత్వం కచ్చితంగా ఫీజును నిర్ధారించకపోవడం ప్రైవేటు డీఎడ్ కాలేజీ నిర్వాకానికి మరింత ఊతం ఇస్తోంది. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం రీయింబర్స్ చేస్తున్న ఫీజునే యాజమాన్య కోటా కింద వసూలు చేయాలని అధికారులు చెబుతున్నా.. కాలేజీలు మాత్రం విద్యార్థుల నుంచి అందినకాడికి దోచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని కాలేజీలైతే సీటుకు రూ. లక్షన్నర వరకూ వసూలు చేస్తున్నాయి కూడా. డీఎడ్ కోర్సు చదివేందుకు మొగ్గు చూపుతున్న వారిలో 90 శాతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే. రూ. లక్షల్లో ఫీజు చెల్లించలేక వారు లబోదిబోమంటున్నారు. ఎస్జీటీ పోస్టులకు అర్హతే ఆకర్షణ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. రాష్ట్రంలో ఇంతకుముందు డీఎడ్ కోర్సుకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు.. కాలేజీల సంఖ్య కూడా తక్కువే. దాంతో అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండిపోయింది. ప్రస్తుతం విద్యాహక్కు చట్టం నేపథ్యంలో.. డీఎడ్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో చాలా మంది డీఎడ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల ఆసక్తిని ప్రైవేటు డీఎడ్ కాలేజీల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. రూ. 12,500 ఉన్న కన్వీనర్ కోటా ఫీజుకంటే పది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 642 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఉండగా వాటిలో 80 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 20 శాతాన్ని యాజమాన్య కోటాలో భర్తీచేస్తారు. డీఎడ్ కాలేజీలన్నింటిలో కలిపి దాదాపుగా 36 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి 3 లక్షల మంది వరకూ డైట్‌సెట్ రాయగా.. అందులో 2.72 లక్షల మంది అర్హత సాధించారు. దాంతో యాజమాన్య కోటాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రూ. లక్షన్నరదాకా: ప్రధాన పట్టణాల్లో ఉన్న, పేరున్న డీఎడ్ కాలేజీలు ఒక్కో సీటుకు రూ. 1.3 లక్షల వరకు వసూలు చేస్తుండగా.. ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ. 70 వేల నుంచి రూ. లక్ష దాకా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. దాంతో యాజమాన్య కోటా భ ర్తీకి కాలేజీలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మెరిట్‌ను పక్కనబెట్టి ఎక్కువ డబ్బు చెల్లించినవారికే సీట్లను కేటాయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాజమాన్య కోటాకు ఫీజు విధానమేదీ? రాష్ట్రంలోని 25 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సీటు పొం దేందుకు.. రూ. లక్ష లోపు ఆదాయం ఉండి, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు రూ. 150 అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే చాలు. ట్యూషన్ ఫీజును ప్రభుత్వమే రీయింబర్స్మెంట్ చేస్తుంది. రీయింబర్స్మెంట్ వర్తించని విద్యార్థులు రూ. 2,325 చెల్లించాలి. ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీటు పొందే, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించే విద్యార్థులు రూ. 1,500 అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే చాలు. రీయింబర్స్ పరిధిలోకి రాని విద్యార్థులు రూ. 12,500 అడ్మిషన్, ట్యూషన్ ఫీజుల కింద చెల్లించాలి. అయితే, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో యాజ మాన్య కోటాకు ఫీజు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించడం లేదు. అటు ప్రవేశ ఫీజుల నియంత్రణ కమిటీ పరిధిలోనూ డీఎడ్ కోర్సుల ఫీజులు లేవు. దాంతో ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదనే ధైర్యంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అసలు డీఎడ్ యాజమాన్యకోటా సీటుకు కూడా రూ. 12,500 మాత్రమే ఫీజుగా వసూలు చేయాలని అధికారులు చెబుతున్నా.. ఎక్కడా అమలుకావడం లేదు. -
ఆన్లైన్లోనే యాజమాన్య కోటా భర్తీ
* ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు స్పష్టం చేసిన హైకోర్టు * ఎన్నారై కోటా 15 శాతం భర్తీకి అనుమతి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారానే భర్తీ చేయాలని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వ జీవో 66ను సమర్థించింది. విద్యార్థుల ప్రయోజనం కోసం జారీ చేసిన ఈ జీవో విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే సీట్ల భర్తీకి సంబంధించి యాజమాన్యాలకు ధర్మాసనం కొన్ని వెసులుబాటులు ఇచ్చింది. విద్యార్థులకు నేరుగా కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంచడంతో పాటు వారి నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించాలని స్పష్టం చేసింది. అలా నేరుగా, మరోవైపు ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నీ కలిపి మెరిట్ జాబితా తయారుచేయాలని ఆదేశించింది. విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలనతో పాటు, వారి స్థితిగతులు, ప్రవర్తన తదితర విషయాలను యాజమాన్యాలు తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా విద్యార్థి ప్రవేశాన్ని తిరస్కరిస్తే, అందుకు సహేతుక కారణాలను తెలియజేయాలని, అలాగే ఆ విద్యార్థితో పాటు ఉన్నత విద్యామండలికి సమాచారం ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించింది. అలాగే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పూరించే సమయంలో విద్యార్థులు పలు కాలేజీల్లో సీట్లను రిజర్వ్ చేసుకునే (మల్టిపుల్ బ్లాకింగ్) అంశంపై యాజమాన్యాలు వ్యక్తంచేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంది. ఈ సమస్య పరిష్కారానికి అటు యాజమాన్యాలు, ఇటు ఉన్నత విద్యామండలి అధికారులు పరస్పరం చర్చించుకుని, పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలని సూచించింది. ప్రవాస భారతీయులు (ఎన్నారై) కోటాను 15 నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. గతంలో ఉన్నట్లుగానే 15 శాతం మేర భర్తీ చేసుకోవచ్చునని యాజమాన్యాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శ్రేయాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రేయాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ అనంతుల వినయ్‌కుమార్‌రెడ్డి, మరికొందరు దాఖలుచేసిన పిటిషన్లను పరిష్కరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణిలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ‘ఏపీసెట్ దరఖాస్తుల్లో తప్పులు దిద్దుకోండి’ హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీసెట్-2013) దరఖాస్తుల్లో దొర్లిన తప్పులు సరిచేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించినట్టు ఏపీసెట్ సభ్య కార్యదర్శి ఆచార్య రాజేశ్వరరెడ్డి తెలిపారు. సవరించిన దరఖాస్తులను ఈ నెల 31లోపు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏపీసెట్ కార్యాలయంలో లేదా, మెయిల్, లెటర్స్ ద్వారా తమకు అందజేయాలని కోరారు. www.apset.org/apset 2012@gmail.com అనే వెబ్సైట్ ద్వారా తప్పులు సరిదిద్దుకోవచ్చని తెలిపారు.