
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు వైద్య కాలేజీల్లోని బీ, సీ (ఎన్‌ఆర్‌ఐ) కేటగిరీ సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని, ఈనెల 21న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి దూర విద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment