గతంలో ఉన్న సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్లలో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. ఈ ఏడాది పెరుగుతున్న సీట్లు ఎన్ని, ఏ కళాశాలలో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయన్నదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో గత ఏడాది కౌన్సెలింగ్ నిర్వహించిన సీట్ల మేరకే అడ్మిషన్లు చేయాలని నిర్ణయించారు. పీజీ ప్రవేశ పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడం, ఆ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించడం తెలిసిందే. సోమవారం పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి.
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 2,431 పీజీ సీట్లు ఉన్నాయి. ప్రైవేటులో 50 శాతం యాజమాన్య కోటా అంటే 646 సీట్లు ఉంటాయి. ఇవి మినహాయించి మిగతా వాటికి ఈ నెలాఖరు నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ సీట్లు పెరిగితే జూన్‌లో జరిగే రెండో కౌన్సిలింగ్‌లో, జూలై 10లోగా జరిగే మూడో కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. మరో రెండు రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు.
పీజీ వైద్య సీట్లపై అస్పష్టత..
Published Tue, May 6 2014 3:18 AM | Last Updated on Fri, May 25 2018 3:27 PM
Advertisement
Advertisement