మెడికల్‌ కాలేజీల్లో ప్రతి సీటూ ప్రతిభకే | no management quota in medical colleges | Sakshi

Feb 7 2017 8:26 AM | Updated on Mar 21 2024 10:47 AM

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు సర్కారుకు ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ ఫీజులతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న వారికే సీట్లు లభిస్తాయి. సీట్ల కొనుగోళ్లు, అమ్మకాలకు చెక్‌ పడుతుంది. అంతేకాదు ప్రభుత్వం నిర్ధారించిన ప్రైవేటు ఫీజు తప్ప ఇష్టారాజ్యంగా డొనేషన్లు వసూలు చేయడానికీ అవకాశం ఉండదు. అయితే వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement