డాక్టర్ కలకు విదేశీ చేయూత
ఎంబీబీఎస్.. బైపీసీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదవాలనుకునే కోర్సు.. దేశంలో మెడికల్ సీట్లు పరిమితంగా ఉండటంతో వాటిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు.. మెరిట్‌లో సీటు రాకున్నా మేనేజ్‌మెంట్ కోటాలో చేరాదామనుకుంటే ఫీజులు చెల్లించడం తలకు మించిన భారం.. ప్రత్యామ్నాయంగా డాక్టర్ కలను సాకారం చేసుకోవడానికి దోహదం చేస్తున్నాయి విదేశీ విశ్వవిద్యాలయాలు.. ఈ నేపథ్యంలో విదేశాల్లో వైద్య విద్యనభ్యసించాలంటే పాటించాల్సిన విధివిధానాలపై విశ్లేషణ..
ఉన్నత విద్య మాదిరిగానే.. ప్రస్తుతం ఎంబీబీఎస్ కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇందులో తెలుగు విద్యార్థుల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. విదేశీ వైద్య విద్యవైపు మన విద్యార్థులు ఆకర్షితులు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. దేశంలో ఏదైనా మెడికల్ కాలేజీలో చేరాలంటే సంబంధిత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో లక్షలాది మంది విద్యార్థులు ఇందుకు పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రవేశం కచ్చితంగా లభిస్తుందనే గ్యారంటీ లేదు. అదే విదేశీ యూనివర్సిటీల విషయానికొస్తే ఎటువంటి ప్రవే శ పరీక్షలు లేకుండానే నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
మన దేశంలో మెరిట్‌లో సీటు రాకున్నా.. మేనేజ్‌మెంట్ కోటాలో చేరాదామనుకుంటే ఫీజులు తలకు మించిన భారంగా ఉన్నాయి. అదే విదేశాల్లోనైతే ఇక్కడి మేనేజ్‌మెంట్ కోటా ఫీజుతో పోల్చితే దాదాపు సగం ఖర్చుతో కోర్సును పూర్తిచేసే అవకాశం లభిస్తుంది. ఎటువంటి డొనేషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. మనకు అనుకూలమైన దేశాన్నీ, అక్కడి విద్యా సంస్థను ఎంచుకుని చేరటమే.శ ఉంటుంది.
దేశాలివే:
భారతీయ విద్యార్థులు ఎక్కువగా చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్థాన్, సెంట్రల్ అమెరికా దేశాలకు చె ందిన యూనివర్సిటీల్లో చేరుతున్నారు. వీటిలో చైనా, ఫిలిప్పీన్స్ దేశాల్లోని యూనివర్సిటీలకు తెలుగు విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. 60 నుంచి 70 శాతం మంది చైనా యూనివర్సిటీలను ఎంచుకుంటున్నారు.
అర్హతలు:
అడ్మిషన్ తీసుకున్న సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
సబ్జెక్ట్‌లతో) ఇంటర్మీడియెట్ పూర్తి చేయాలి.
విద్యార్థులదే బాధ్యత:
గతంలో విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నుంచి అర్హత సర్టిఫికెట్ పొందాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఎంసీఐ నిబంధనలను సవరించింది. ఇప్పుడు ఎంసీఐ నుంచి ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేకుండానే విదేశాల్లో మెడిసిన్ చేయవచ్చు. అయితే గతంలో విద్యార్థి దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీకి గుర్తింపు లేకుంటే.. సదరు దరఖాస్తును ఎంసీఐ తిరస్కరించేది. దాంతో గుర్తింపు ఉన్న యూనివర్సిటీల్లో మాత్రమే విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉండేది. మారిన నిబంధనల మేరకు యూనివర్సిటీల గుర్తింపును నిర్ధారించుకునే బాధ్యత విద్యార్థులదే. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. మారిన నిబంధనల మేరకు యూనివర్సిటీ గుర్తింపును నిర్ధారించుకునే బాధ్యత విద్యార్థులదే. కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
విద్యా సంవత్సరం:
రష్యా, ఉక్రెయిన్, చైనా ఏ దేశంలోనైనా సాధారణంగా సెప్టెంబర్/అక్టోబర్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. జూన్‌తో ముగుస్తుంది. ఏడాదికి రెండు విడతల సెలవులు ఉంటాయి. మొదటి విడతలో శీతాకాలంలో వారం నుంచి పది రోజులు.. తర్వాత జూలై, ఆగస్ట్ రెండు నెలలు సెలవులు ఇస్తారు. ఈ సమయంలో విద్యార్థులు స్వదేశానికి రావచ్చు.
వసతి:
వసతి విషయానికొస్తే.. అన్ని దేశాల్లో కూడా నివాస వసతి సౌకర్యం యూనివర్సిటీ/ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్‌లో ఉంటుంది. విద్యార్థి అవసరం మేరకు సింగిల్ రూమ్ లేదా షేరింగ్ రూమ్ కేటాయిస్తారు. కొన్ని దేశాల్లోనైతే భారతీయులు ఇష్టపడే సంప్రదాయ ఆహారం లభిస్తుంది. సొంతంగా కూడా వంట చేసుకోవచ్చు. అంతేకాకుండా అత్యాధునిక లైబ్రరీ, ల్యాబ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.
బోధన ఆంగ్లంలోనే:
అన్ని దేశాల్లో బోధన ఆంగ్లంలోనే ఉంటుంది. కోర్సులో భాగంగా రోజూ స్థానిక భాష నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. ఎందుకంటే రెండేళ్ల తర్వాత ఉండే క్లినికల్ ప్రాక్టీస్‌లో భాగంగా స్థానికులతో మాట్లాడి.. చికిత్స చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్థానిక భాష తప్పకుండా నేర్చుకోవాలి.
గుర్తింపు నిర్ధారణ:
ఆయా యూనివర్సిటీలకు.. ఆఫర్ చేస్తున్న కోర్సులకు సంబంధిత అధీకృత ఏజెన్సీల గుర్తింపు ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్థాన్ వంటి దేశాల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ-వెబ్‌సైట్: జ్ట్టిఞ:// avicenna. ku.dk/ database/medicine) గుర్తింపు ఉన్న వర్సిటీలను మాత్రమే ఎంచుకోవాలి. చైనాలో మాత్రం.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ, వెబ్‌సైట్: www.mciindia.org) గుర్తింపు ఇచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లలో మాత్రమే చేరాలి. ఎందుకంటే ఈ కళాశాలలో మాత్రమే బోధన ఆంగ్లంలో ఉంటుంది.
దాదాపు ఒకటే:
విదేశీ యూనివర్సిటీలు అందించే డిగ్రీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపు ఉంటుంది. సిలబస్ కూడా దాదాపు ఒకే విధంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంసీఐ.. తన మార్గదర్శకాలకు దగ్గరగా ఉండే యూనివర్సిటీలకు మాత్రమే గుర్తింపునిస్తుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉండే ఇంటర్న్‌షిప్ విషయానికొస్తే.. ఒక్క చైనా మినహా మిగతా దేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు విధిగా మన దేశంలోనే ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశాలు ఎక్కువ చలి ప్రదేశాలు. వాటితో పోల్చితే మన దేశ వాతావరణం భిన్నంగా ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రజలకు, ఇక్కడ ప్రజలకు వచ్చే వ్యాధుల్లో తేడా ఉంటుంది. మన దేశ వాతావరణ పరిస్థితులు చైనాతో సరిపోతుండడంతో.. ఇంటర్న్‌షిప్ రెండు దేశాల్లో ఎక్కడైనా చేయవచ్చు.
కోర్సు తర్వాత:
కోర్సు పూర్తి చేసిన తర్వాత మన దేశంలో చదివిన మెడికల్ గ్రాడ్యుయేట్ల మాదిరిగానే ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు. ఇందుకోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించాలి. దీన్ని ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ)గా కూడా వ్యవహరిస్తారు. ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నిర్వహిస్తుంది. ఏడాదికి రెండు సార్లు (జూన్, డిసెంబర్) ఈ పరీక్ష జరుగుతుంది. ఇందుకోసం రూ. 4,000 ఫీజు చెల్లించాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత గుర్తింపు ఉన్న ఆస్పత్రిలో ఏడాది హౌస్ సర్జన్సీ చేయాలి (చైనాలో చదివిన విద్యార్థులు మినహా). ఈ రెండు దశలను పూర్తి చేస్తే ఎంసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందుతుంది. తద్వారా ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఇక్కడ మెడిసిన్ చేసిన విద్యార్థులతో సమానంగా అవకాశాలను దక్కించుకోచ్చు.
రెండు-మూడు నెలల ముందు:
చాలా దేశాల్లో సెప్టెంబర్‌లో అకడెమిక్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నాహకాలు ప్రారంభించాలి. పాస్‌పోర్ట్ లభించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రెండు-మూడు నెలల ముందు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. పాస్‌పోర్ట్ వచ్చిన తర్వాత వెళ్లాల్సిన దేశ ఎంబసీని సంప్రదించి స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. విద్యార్హతలు, ఆర్థిక స్థోమత, సంబంధిత దేశానికి ఏ కోర్సు చదవడానికి వెళుతున్నారు? అనే విషయూలను క్షుణ్నంగా పరిశీలించి వీసా జారీ చేస్తారు. వీసా కోసం కొన్ని దేశాల ఎంబసీలకు విద్యార్థి నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు (చైనా, కిర్గిజిస్తాన్ వంటివి). ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు మాత్రం నేరుగా వెళ్లడం తప్పనిసరి.
దేశం కోర్సు వ్యవధి మొత్తం ఖర్చు
చైనా ఐదేళ్లు+ఏడాది (ఇంటర్న్‌షిప్) రూ. 15-20 లక్షలు
కిర్గిజిస్థాన్ ఐదేళ్లు+ఏడాది (ఇంటర్న్‌షిప్) రూ. 11-13 లక్షలు
రష్యా ఆరేళ్లు+ఏడాది (ఇంటర్న్‌షిప్) రూ. 18-20 లక్షలు
ఉక్రెయిన్ ఆరేళ్లు+ఏడాది (ఇంటర్న్‌షిప్) రూ. 18-20 లక్షలు
ఫిలిప్పీన్స్ ఆరేళ్లు+ఏడాది (ఇంటర్న్‌షిప్) రూ. 20-22 లక్షలు
సెంట్రల్ అమెరికా
దేశాలు నాలుగు-ఆరేళ్లు రూ. 30-40 లక్షలు
చైనా నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. మనదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులందరికీ ఒకే తరగతి గది కేటాయిస్తారు. సిలబస్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడితో పోల్చితే అక్కడి విద్యార్థులకు ఎక్కువగా క్లినికల్ ఎక్స్‌పోజర్ లభిస్తుంది. మన దేశ వాతావరణ పరిస్థితులు చైనాతో సరిపోతుండడంతో..కోర్సు పూర్తయ్యాక ఇంటర్న్‌షిప్‌ను రెండు దేశాల్లో ఎక్కడైనా పూర్తి చేయవచ్చు. బయటికి వెళ్లినప్పుడు అవసరాల నిమిత్తం, క్లినికల్ ప్రాక్టీస్‌లో భాగంగా స్థానికులతో మాట్లాడాల్సి ఉంటుంది.
కోర్సు మొదటి సంవత్సరంలో స్థానిక భాషను నేర్పిస్తారు. అక్కడి యూనివర్సిటీలన్నీ ప్రభుత్వానినే కావడంతో ఎటువంటి డొనేషన్ అవసరం లేదు. కేవలం కోర్సు ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే హాస్టల్‌లో వసతి కల్పిస్తారు. ఆహారం పరంగా కూడా ఎటువంటి సమస్య ఉండదు. 90 శాతం ఇక్కడ లభించే కూరగాయాలు, పండ్లు అక్కడ కూడా లభిస్తాయి. సొంతంగా వంట చేసుకోవాలనుకునే వారికి కామన్ కిచెన్ సౌకర్యం కల్పిస్తారు. ఎంసీఐ పరీక్షలో అర్హత సాధిస్తే.. ఉన్నత విద్య, ఉద్యోగ పరంగా భారత్‌లో మెడిసిన్ పూర్తి చేసిన వారితో సమానంగా అవకాశాలు దక్కించుకోవచ్చు. వాతావరణ పరంగా ఏ రకంగా చూసిన చైనా పరిస్థితులు మన దేశంతో సరిపోతాయి.
-డాక్టర్ కె.ఎస్.ఎన్.మూర్తి,
గ్లోబల్ హాస్పిటల్, హైదరాబాద్
గమనించాల్సినవి:
లేదా వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం మంచిది. సొంత ఖర్చుల కోసం ఇంటర్నేషనల్ క్రెడిట్/డెబిట్ కార్డు తీసుకెళ్లడం మంచిది. హెల్త్‌పాలసీ ఉండటం మంచిది.చేరే యూనివర్సిటీకి ఎంసీఐ గుర్తింపు ఉందో లేదా నిర్ధారించుకోవాలి.కన్సెల్టెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లాలంటే.. సంబంధిత కన్సెల్టెన్సీల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఆ కన్సెల్టెన్సీ ద్వారా అంతకుముందు వెళ్లిన విద్యార్థుల సమాచారాన్ని సేకరించాలి. విదేశాల్లో కోర్సు పూర్తి చేసిన, ప్రస్తుతం కోర్సును చేస్తున్న విద్యార్థుల్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేయూలి.