సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరంలో కూడా ఇంజనీరింగ్‌లో భారీగా సీట్లు మిగలనున్నాయి. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటాలో కలిపి ఈ ఏడాది 3,48,686 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇంజనీరింగ్ విభాగంలో 2,77,608 మంది ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాయగా... 2,17,672 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే కన్వీనర్ కోటాలోనే 2,46,044 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యాజమాన్య కోటాలో మరో 1,02,642 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటాలో భాగంగా 662 ప్రైవేటు కళాశాలల్లో 2,39,498 సీట్లు, 31 యూనివర్సిటీ కళాశాలల్లో 6,546 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సాంకేతిక విద్య కమిషనర్, అడ్మిషన్ల కన్వీనర్ అజయ్ జైన్ వెల్లడించారు. వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేనాటికి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచీల్లో సీట్లు పెరగగా ఐటీ బ్రాంచీలో సీట్లు భారీగా తగ్గాయి. గత ఏడాది మొత్తంగా లక్షన్నరకు పైగా సీట్లు మిగిలాయి. ఈ ఏడాది కూడా దాదాపు రెండు లక్షల సీట్లు మిగులుతాయని అంచనా. ఇక బీ-ఫార్మసీలో మొత్తం 277 ప్రైవేటు కళాశాలల్లో 30,840 సీట్లు, తొమ్మిది ప్రభుత్వ కళాశాలల్లో 500 సీట్లు కలిపి మొత్తంగా 31,340 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రధాన బ్రాంచీల్లో అందుబాటులో ఉన్న సీట్లు
కోర్సు- సీట్లు: సివిల్ ఇంజనీరింగ్- 40,650, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-79,670, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-52,275, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-96,305, మెకానికల్ ఇంజనీరింగ్-55,495, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ-16,795, మైనింగ్ ఇంజనీరింగ్-2,160, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-1,110, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్-525, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్-180, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ-60, పెట్రోలియం ఇంజనీరింగ్-480, ఏరోనాటికల్-1,920, ఏరోస్పేస్-60, అగ్రికల్చరల్-600, ఎయిర్‌లైన్‌స మేనేజ్‌మెంట్-60.
ఇంజనీరింగ్‌లో 3.48 లక్షల సీట్లు
Published Thu, Aug 15 2013 4:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement