Pharmacy Courses
-
ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2024)కు సంబంధించిన ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీసీ స్ట్రీమ్‌లో బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సులతోపాటు బైపీసీ స్ట్రీమ్‌లో బీఈ, బీ.టెక్‌లలో బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాసూ్యటికల్ ఇంజనీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సుల సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేశాయి. ఏపీ ఈఏపీసెట్–2024లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ట్ఛ్టట.టఛిజ్ఛి.్చp.జౌఠి.జీn లో లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు శనివారం రాత్రి వరకు అవకాశం ఉంది. డిసెంబర్ ఒకటో తేదీ వరకు విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఎంపిక చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో పరిశీలిస్తారు. శని, ఆదివారాల్లో కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు డిసెంబర్ 2వ తేదీ ఒక్క రోజు అవకాశం ఉండగా, 4వ తేదీన సీట్లు కేటాయిస్తారు. డిసెంబర్ 4 నుంచి ఆరో తేదీలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంది. బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు శనివారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. కళాశాలల ఎంపిక కోసం 3 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 8వ తేదీన వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. డిసెంబర్ 11 సీట్లను కేటాయిస్తారు. అదే రోజు నుంచి 14వ తేదీలోపు కళాశాలల్లో చేరాలి. -
నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 639 ఇంజనీరింగ్ కాలేజీల్లో 2,24,000 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. కళాశాలల వారీగా ఫీజుల వివరాలను కౌన్సెలింగ్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు తెలిపింది. విద్యార్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుంచి గానీ, ఎంసెట్ సహాయక కేంద్రం నుంచి గానీ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకోవాలనుకుంటే ఈనెల 13, 14 తేదీల్లో మార్చుకోవచ్చు. 13న 1వ ర్యాంకు నుంచి లక్ష వరకు, 14న 1,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులు ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెల్లడిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 23న కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేరోజు తరగతులు ప్రారంభమవుతాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఇప్పటివరకు 1,29,734 మంది హాజరయ్యారు. వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగుతుంది. మంగళవారంనాటికి కూడా హాజరుకాలేకపోయిన వారు ఈనెల 12 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై, స్క్రాచ్ కార్డు పొంది, అక్కడే సహాయక కేంద్రంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఫీజులను గమనించాలి.. విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసే ముందు కళాశాలల నాణ్యతతోపాటు, వాటిలో ఫీజులను గమనించాల్సిందిగా ఉన్నత విద్యామండలి వర్గాలు సూచించాయి. కళాశాలల ఫీజులు రూ.30 వేల నుంచి రూ.1,13,000 వరకు వేర్వేరుగా ఉన్నందున ఫీజులు భరించే స్తోమతను బట్టి కళాశాలలను ఎంపికచేసుకోవాలని తెలిపాయి. ప్రభుత్వం 259 కళాశాలలకు రూ.35 వేలుగా, 175 కళాశాలలకు రూ.35,500 నుంచి రూ.1,13,300గా ఫీజులు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వ్యయ నివేదికలు ఇవ్వని 195 కళాశాలలకు మాత్రం సెప్టెంబర్ 30 లోగా ఆన్లైన్లో నివేదికలు సమర్పించాలన్న షరతుతో అడ్హాక్ ఫీజుగా రూ.30 వేలు ఖరారు చేసింది. ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.35 వేలు పొందుతారు. వీటితో పాటు, హాస్టల్ ఫీజులు, రవాణా వ్యయాలు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వెబ్ఆప్షన్లు నమోదుచేసుకుంటే మంచిదని మండలి వర్గాలు పేర్కొన్నాయి. సీఎం వద్దకు ‘బీ-కేటగిరీ’.. యాజమాన్య కోటా సీట్ల భర్తీ అంశం ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ఆగస్టు 13న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడినప్పటికీ.. హైకోర్టు ధర్మాసనం ఈ సీట్లను జీవో 66కు లోబడి ఆన్లైన్లో భర్తీ చేయాలని ఆదేశించింది. అయితే అప్పటికే వెలువడిన నోటిఫికేషన్‌ను కొనసాగించాలా? లేక తాజా తీర్పు అమలు చేయాలా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ ఉన్నత విద్యామండలి ఉన్నత విద్యాశాఖను కోరింది. దీనిపై తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతూ సీఎంకు ఉన్నత విద్యాశాఖ సోమవారం సంబంధిత ఫైలును పంపింది. -
తీరు మారని యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు బీ-కేటగిరీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు మార్గద ర్శకాలను పాటించడం లేదు. ఈ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు ఫారాలను కళాశాల వెబ్సైట్లో, నోటీసుబోర్డులో అందుబాటులో ఉంచడంతో పాటు ఉన్నత విద్యామండలి, అఫ్లియేషన్ ఉన్న యూనివర్సిటీకి పంపించాలని హైకోర్టు ఆదేశించింది. ఆన్లైన్లో కూడా దరఖాస్తులు స్వీకరించే వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఆన్లైన్లో స్వీకరణ అంశం పక్కనబెడితే అసలు దరఖాస్తులు అందుబాటులో ఉంచుతున్న కళాశాలలే తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 224 కళాశాలలు మాత్రమే ఉన్నత విద్యామండలికి దరఖాస్తు ఫారాలను పంపించాయి. కన్వీనర్ కోటా అడ్మిషన్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే యాజమాన్య కోటా భర్తీకి పేరున్న కళాశాలలతో పాటు వందలాది కళాశాలలు పత్రికల్లో ప్రకటనలు జారీచేసినప్పటికీ.. దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచిన కళాశాలలు కేవలం 224 మాత్రమే కావడం విస్మయం కలిగిస్తోంది. పైగా వీటిలో పేరున్న పెద్ద కళాశాల ఒక్కటీ లేదు. ఈ 224లో ఫార్మసీ కళాశాలలు కూడా ఉన్నాయి. దాదాపు 673 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నా.. నామమాత్రంగా కొన్ని కళాశాలలు మాత్రమే బీ-కేటగిరీ దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చిన్న కళాశాలలు విధిగా దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంచడంతో పాటు రుసుం కూడా కేవలం రూ.200గా ఖరారు చేశాయి. అయితే కొన్ని కళాశాలలు మాత్రం రూ.2 వేల వరకు ఖరారు చేశాయి. అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం కారణంగా ఇప్పటికే రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారని, డీమ్డ్ వర్సిటీల్లో ప్రవేశాలు పొందారని, ఈ ఏడాది యాజమాన్య కోటా సీట్లకు అసలు డిమాండే లేదని హోలీ మేరీ గ్రూప్ సంస్థల చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ‘దాదాపు 20 వేల మంది విద్యార్థులు వలస వెళ్లినట్టు అంచనా. హైదరాబాద్‌లో అగ్రశ్రేణిలో ఉన్న దాదాపు 25 కళాశాలలకు యాజమాన్య కోటా పూర్తిగా భర్తీ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన వాటి పరిస్థితి కష్టంగా కనిపిస్తోంది. సీట్ల భర్తీ ఎలా ఉన్నా అన్ని కళాశాలలు దరఖాస్తులు అందుబాటులో ఉంచి పారదర్శకంగా భర్తీ చేయడం కళాశాలలకే మేలు చేస్తుంది’ అని అనురాగ్ గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకటిరెండు ప్రధాన కళాశాలలు తమ వెబ్సైట్లలో దరఖాస్తు ఫారాలను పొందుపరిచినప్పటికీ ఇంతవరకు ఉన్నత విద్యామండలికి పంపలేదు. అవి పంపేలోగా.. దరఖాస్తులు పంపేందుకు వారిచ్చిన గడువు ముగిసిపోతోందని అభ్యర్థులు వాపోతున్నారు. డ్యూ అక్నాలెడ్జిమెంట్ మరచిపోకండి.. యాజమాన్య కోటా సీటు కోసం దరఖాస్తు ఫారాలను ఉన్నత విద్యామండలి వెబ్సైట్ ఠీఠీఠీ.్చఞటఛిజ్ఛి.ౌటజ నుంచి డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు ఫారం నింపి, నిర్దేశిత రుసుం డీడీ ద్వారా చెల్లించి, ధ్రువపత్రాలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తు ముట్టినట్టుగా ఆధారం ఉండాలంటే రిజిస్టర్డ్ పోస్టు చేసేటప్పుడు అక్నాలెడ్జిమెంట్ కార్డును కూడా తప్పనిసరిగా జతపరచాలి. పోస్టాఫీస్‌లో నామమాత్రపు రుసుం ద్వారా ఈ అక్నాలెడ్జిమెంట్ కార్డు అందుబాటులో ఉంటుంది. -
ఇంజనీరింగ్‌లో 3.48 లక్షల సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరంలో కూడా ఇంజనీరింగ్‌లో భారీగా సీట్లు మిగలనున్నాయి. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటాలో కలిపి ఈ ఏడాది 3,48,686 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇంజనీరింగ్ విభాగంలో 2,77,608 మంది ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాయగా... 2,17,672 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే కన్వీనర్ కోటాలోనే 2,46,044 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యాజమాన్య కోటాలో మరో 1,02,642 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటాలో భాగంగా 662 ప్రైవేటు కళాశాలల్లో 2,39,498 సీట్లు, 31 యూనివర్సిటీ కళాశాలల్లో 6,546 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సాంకేతిక విద్య కమిషనర్, అడ్మిషన్ల కన్వీనర్ అజయ్ జైన్ వెల్లడించారు. వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేనాటికి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచీల్లో సీట్లు పెరగగా ఐటీ బ్రాంచీలో సీట్లు భారీగా తగ్గాయి. గత ఏడాది మొత్తంగా లక్షన్నరకు పైగా సీట్లు మిగిలాయి. ఈ ఏడాది కూడా దాదాపు రెండు లక్షల సీట్లు మిగులుతాయని అంచనా. ఇక బీ-ఫార్మసీలో మొత్తం 277 ప్రైవేటు కళాశాలల్లో 30,840 సీట్లు, తొమ్మిది ప్రభుత్వ కళాశాలల్లో 500 సీట్లు కలిపి మొత్తంగా 31,340 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన బ్రాంచీల్లో అందుబాటులో ఉన్న సీట్లు కోర్సు- సీట్లు: సివిల్ ఇంజనీరింగ్- 40,650, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-79,670, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-52,275, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-96,305, మెకానికల్ ఇంజనీరింగ్-55,495, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-16,795, మైనింగ్ ఇంజనీరింగ్-2,160, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్-1,110, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్-525, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్-180, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ-60, పెట్రోలియం ఇంజనీరింగ్-480, ఏరోనాటికల్-1,920, ఏరోస్పేస్-60, అగ్రికల్చరల్-600, ఎయిర్లైన్స మేనేజ్మెంట్-60. -
బీ-కేటగిరీపై తొలగని భయాలు
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో యాజమాన్య కోటా(బీ-కేటగిరీ) సీట్ల భర్తీకి మధ్యం తర ఉత్తర్వుల ద్వారా హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ.. అభ్యర్థులకు పూర్తిస్థాయిలో భరోసా దక్కలేదు. దరఖాస్తు ఫారాలు ప్రతి అభ్యర్థికీ అందేందు కు తీసుకోవాల్సిన చర్యల విషయంలో అటు యాజ మాన్యాలకు, ఇటు ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ విద్యార్థుల నుంచి యాజమాన్యాలు దరఖాస్తులు స్వీకరిస్తాయా? మెరి ట్ ప్రకారం జాబితాలు రూపొందిస్తాయా? అన్నది అనుమానమే. ఆన్‌లైన్‌లోనూ స్వీకరించాలని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నా కళాశాలల వద్ద ఆ వెసులుబాటే లేదు. కొన్ని కళాశాలలకు వెబ్సైట్ కూడా లేదు. ప్రతిభా క్రమంలో భర్తీచేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. ఇందుకు తగిన మార్గదర్శకాలు, విద్యార్థి ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన మార్గాలు ఉన్నత విద్యాశాఖ వద్ద లేవని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. బీ-కేటగిరీ సీట్ల భర్తీలో మళ్లీ గత అక్రమాలే పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవరోధాలెన్నో: గతంలో బీ కేటగిరీ సీట్లకు అసలు దరఖాస్తే దొరికే పరిస్థితి లేదు. హైకోర్టు తాజా తీర్పు ప్రకారం ఇప్పుడు దరఖాస్తులు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి చేసిన ఈ దరఖాస్తులను విద్యార్థులు ఆన్‌లైన్‌లోగానీ, రిజిస్టర్డ్ పోస్టు ద్వారాగానీ కళాశాలకు పంపించాలని సూచించింది. అయితే కళాశాలలు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉం చినా.. వాటిని ఆన్లైన్లోనే స్వీకరించే వ్యవస్థ లేదు. ఆన్లైన్లో స్వీకరించే ఏర్పాటు చేసుకున్నా.. వాటిని స్వీకరించినట్టు రుజువు ఇచ్చేలా వ్యవస్థ లేదు. దీనిపై ఉన్నత విద్యాశాఖ అధికారులూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఉన్నత విద్యామండలి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తే తప్ప విద్యార్థుల భయాలు తొలగే పరిస్థితి కనిపించట్లేదు. కన్వీనర్ కోటాకు, బీ-కేటగిరీ సీట్లకు ఒకే ఫీజు ఉండడం, గతంలో కంటే ఇప్పుడు 300 శాతం వరకు ఫీజులు పెరగడంతో గతేడాది డొనేషన్లేవీ లేకుండానే చాలా కళాశాలలు పారదర్శకంగానే సీట్లు భర్తీ చేశాయి. కానీ 50 కళాశాలలు అక్రమాలకు పాల్పడగా.. వాటికి ఉన్నత విద్యామండలి సంజాయిషీ నోటీసులిచ్చి చేతులు దులుపుకొంది. అక్రమాలకు పాల్పడే కాలేజీల జాబితా మండలి వద్ద ఉన్నందున వాటి భర్తీ ప్రక్రియపై డేగకన్నేస్తే అవకతవకల్ని అరికట్టే వీలుంది. జీవో 74 ప్రకారమే: జీవో 66పై తీర్పు రిజర్వులో ఉన్నందున పాత జీవో 74 ప్రకారమే యాజమాన్య కోటా సీట్లు భర్తీకానున్నాయి. ఆ జీవో ప్రకారం తొలి ప్రాధాన్యం బయటి రాష్ట్రాల ఏఐఈఈఈ (ప్రస్తుతం జేఈఈ-మెయిన్‌గా వ్యవహరిస్తున్నారు) ర్యాంకర్లకు, ఎంసెట్ ర్యాంకర్లకు రెండో ప్రాధాన్యం, ఇంటర్ మార్కులతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మూడో ప్రాధాన్యమిస్తారు.