నేడు పదోన్నతులకు కౌన్సెలింగ్
Published Mon, Apr 17 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM
కర్నూలు సిటీ: జిల్లా పరిషత్ యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 38 ప్రధానోపాధ్యాయ పోస్టుల ఖాళీలను అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల్లో సీనియార్టీ ఉన్న వారితో భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ తాహెరా సుల్తానా సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు డీఈఓ కార్యాలయం సీనియారిటీ జాబితాలోని క్రమ సంఖ్య 4 నుంచి 40 వరకు ఉన్న వారితో పాటు విస్తరించిన జాబితాలో ఉన్న వారు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. పదోన్నతుల సీనియానిటీ జాబితా, ఖాళీల వివరాలను డీఈఓ వెబ్‌సైట్ http://drokrnl13.blogspot.inలో పొందిపరిచామన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వారు సర్వీసు రిజిస్టర్, డిపార్టుమెంట్ టెస్టు, 10 వతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతకు సంబంధించిన ధృవ పత్రాలతో హాజరుకావాలన్నారు.
Advertisement
Advertisement