ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ ప్రశాంతం
ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ ప్రశాంతం
Published Wed, Jul 26 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM
భానుగుడి(కాకినాడ) : జిల్లాలో బుధవారం నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. మంగళవారం తలెత్తిన సమస్యలేవీ బుధవారం తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పీఆర్‌జీ బాలుర ఉన్నత పాఠశాల, డీఈఓ కార్యాలయంలోని ఎస్‌ఎస్‌ఏ ప్రాంగణంలో రెండు కౌన్సెలింగ్ హాల్‌లను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
గణితం, ఇంగ్లిష్‌లకు కొనసాగిన కౌన్సెలింగ్:
గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించి మంగళవారం కౌన్సెలింగ్ కొనసాగింది. మంగళవారం స్కూల్ అసిస్టెంట్ గణితానికి సంబంధించి 702 ఖాళీలకు గానూ 960 మందికి నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ రాత్రి 10 గంటల వరకు నిర్వహించినా సగంమందికే జరిగింది. బుధవారం మధ్యాహ్నం వరకు గణితానికి సంబంధించి మిగిలిన 352 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంగ్లిష్‌లో సైతం సగం మందికిపైగా ఉపాధ్యాయులకు బుధవారం మధ్యాహ్నం వరకూ కౌన్సెలింగ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఫిజికల్ సైన్స్‌కు సంబంధించి 437 ఖాళీలకు గానూ 739మందికి, పీఎస్ హెచ్‌ఎంకు సంబంధించి 161 ఖాళీలకు గానూ 280 మందికి రాత్రి పది గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
నేడు బయలాజికల్ సైన్స్, సోషల్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్:
గురువారం బయలాజికల్ సైన్స్‌కు సంబంధించి 410 ఖాళీలకు గానూ 620 మందికి, సోషల్‌కు సంబంధించి 345 ఖాళీలకు గానూ 480 మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్.అబ్రహాం పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుందని, ఉపాధ్యాయులంతా కౌన్సెలింగ్ హాల్‌లకు హాజరుకావాలని తెలిపారు. బయలాజికల్ సైన్స్‌కు పీఆర్‌జీ బాలుర ఉన్నత పాఠశాలలోనూ, సోషల్‌కు సంబంధించి డీఈఓ కార్యాలయంలోని ఎస్‌ఎస్‌ఏ సమావేశ మందిరంలోను కౌన్సెలింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్‌లోడీవైఈఓ దడాల వాడపల్లి, ఆర్‌ఎంఎస్‌ఏ డీవైఈవో సలాది సుధాకర్, టి.కామేశ్వరరావు, బీవీ రాఘ«వులు, చలపతి, చింతాడ ప్రదీప్‌కుమార్, పీఎన్‌వీవీ ప్రసాద్, టి.తిలక్‌బాబు, కేఎస్ సుబ్రహ్మణ్యం, కేవీ రాఘ«వులు, పి.సుబ్బరాజు,కేవీ శేఖర్, నక్కా వెంకటేశ్వరరావు, లంక జార్జి, టీవీఎస్ రంగారావు, వై.బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement