- తొలిరోజు బోధనేతర సిబ్బందికి
పాడేరు: గిరిజన సంక్షేమ శాఖలోని హెచ్‌ఎంలు, వార్డెన్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, బోధనేతర సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్ ఆదివారం నుంచి చేపడుతున్టన్లు గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ బదిలీలకు 618 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తొలిరోజు నాలుగో తరగతి ఉద్యోగులు (అటెండరు, కుక్, కమాటి, వాచ్‌మెన్), నాన్ టీచింగ్ ఉద్యోగులు (జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, హెచ్‌డబ్ల్యూఓ)లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
29న పీజీ హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్లకు, 30న ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఎస్‌జీటీలకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. బాలికల ఆశ్రమ పాఠశాల్లో 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులను బదిలీ చేసి, వారిస్థానంలో మహిళా ఉపాధ్యాయులను నియమిస్తామని ఆయన తెలిపారు. గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఎస్‌జీటీ మహిళా ఉపాధ్యాయులను అవసరమైతే ఆశ్రమ పాఠశాలలకు బదిలీ చేస్తామని డీడీ మల్లికార్జునరావు పేర్కొన్నారు.