అసాంఘిక శక్తులపై డేగ కన్ను | Guntur Police Councelling to Rowdy Sheeters | Sakshi
Sakshi News home page

అసాంఘిక శక్తులపై డేగ కన్ను

Published Fri, Jul 17 2020 12:37 PM | Last Updated on Fri, Jul 17 2020 12:37 PM

Guntur Police Councelling to Rowdy Sheeters - Sakshi

లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న దృశ్యం­­­­(ఫైల్‌)

సాక్షి, గుంటూరు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నింతరం దృష్టి సారించాల్సిందేనని జిల్లా పోలీస్‌ బాస్‌లు అధికారులు, సిబ్బందికి  సూచిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో వరుస హత్యలకు పథక ప్రణాళికలు రచించిన రౌడీ ముఠాను, ఇటీవల ఓ రౌడీ షీటర్‌ను హతమార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న ఏడుగురిని  గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్‌ జిల్లాలో సైతం పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిగత గొడవలకు దిగిన ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రౌడీ షీటర్లు, వైట్‌ కాలర్, సస్పెక్టెడ్‌ నేరస్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులు, సిబ్బందిని ఇద్దరు ఎస్పీలు హెచ్చరించినట్టు సమాచారం. 

వారం వారం కౌన్సెలింగ్‌
గుంటూరు అర్బన్‌ జిల్లాలో రౌడీ షీటర్లకు విధిగా వారం వారం కౌన్సెలింగ్‌  ఇస్తున్నారు. అర్బన్‌లో 750 మంది వివిధ కేటగిరీలకు చెందిన రౌడీ షీటర్లు ఉన్నారు.  వీరిలో 100 మంది కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదు. మరో 100 మంది జాడ తెలియడం లేదు. వీరి వివరాల కోసం వారి ఆధార్, రేషన్, ఓటర్‌ ఐడీలను ఆధారంగా చేసుకుని అర్బన్‌ పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

పల్నాడుపై ఫోకస్‌
రూరల్‌ జిల్లాలో వ్యక్తిగత గొడవల నేపథ్యంలో ఇటీవల కాలంలో హత్యలు జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడుపై రూరల్‌ పోలీస్‌ బాస్‌ ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సివిల్‌ వివాదాలను వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సంబంధిత ఫిర్యాదుదారులను పోలీసులు బైండోవర్‌ చేస్తున్నారు. రూరల్‌ జిల్లాలో 1500 మందికి పైగా రౌడీ షీటర్లు, వైట్‌ కాలర్, సస్పెక్టెడ్‌ షీట్‌ నేరస్థులున్నారు. వీరి కార్యకలాపాలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి.  సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వీరి ప్రవర్తనను సునిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణా నుంచి పల్నాడు ప్రాంతంలోని నదీ పరీవాహక గ్రామాలకు కృష్ణా నది గుండా, ఇతర మార్గాల్లో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌(ఎన్‌డీపీఎల్‌) వస్తోంది.

ఈ నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా చేస్తూ వరుసగా పట్టుబడిన వారిపై పీడీ యాక్టు ప్రయోగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.  సాక్షి, గుంటూరు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నింతరం దృష్టి సారించాల్సిందేనని జిల్లా పోలీస్‌ బాస్‌లు అధికారులు, సిబ్బందికి  సూచిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో వరుస హత్యలకు పథక ప్రణాళికలు రచించిన రౌడీ ముఠాను, ఇటీవల ఓ రౌడీ షీటర్‌ను హతమార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న ఏడుగురిని  గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్‌ జిల్లాలో సైతం పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిగత గొడవలకు దిగిన ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రౌడీ షీటర్లు, వైట్‌ కాలర్, సస్పెక్టెడ్‌ నేరస్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులు, సిబ్బందిని ఇద్దరు ఎస్పీలు హెచ్చరించినట్టు సమాచారం. 

వారం వారం కౌన్సెలింగ్‌
గుంటూరు అర్బన్‌ జిల్లాలో రౌడీ షీటర్లకు విధిగా వారం వారం కౌన్సెలింగ్‌  ఇస్తున్నారు. అర్బన్‌లో 750 మంది వివిధ కేటగిరీలకు చెందిన రౌడీ షీటర్లు ఉన్నారు.  వీరిలో 100 మంది కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదు. మరో 100 మంది జాడ తెలియడం లేదు. వీరి వివరాల కోసం వారి ఆధార్, రేషన్, ఓటర్‌ ఐడీలను ఆధారంగా చేసుకుని అర్బన్‌ పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

పల్నాడుపై ఫోకస్‌
రూరల్‌ జిల్లాలో వ్యక్తిగత గొడవల నేపథ్యంలో ఇటీవల కాలంలో హత్యలు జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడుపై రూరల్‌ పోలీస్‌ బాస్‌ ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సివిల్‌ వివాదాలను వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సంబంధిత ఫిర్యాదుదారులను పోలీసులు బైండోవర్‌ చేస్తున్నారు. రూరల్‌ జిల్లాలో 1500 మందికి పైగా రౌడీ షీటర్లు, వైట్‌ కాలర్, సస్పెక్టెడ్‌ షీట్‌ నేరస్థులున్నారు. వీరి కార్యకలాపాలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి.  సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వీరి ప్రవర్తనను సునిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణా నుంచి పల్నాడు ప్రాంతంలోని నదీ పరీవాహక గ్రామాలకు కృష్ణా నది గుండా, ఇతర మార్గాల్లో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌(ఎన్‌డీపీఎల్‌) వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా చేస్తూ వరుసగా పట్టుబడిన వారిపై పీడీ యాక్టు ప్రయోగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.  

పద్ధతి మార్చుకోవాలి
రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకోవాలి. నేర ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో మెలగాలి. లేని పక్షంలో ఉపేక్షించేది లేదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టం.–ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి, గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement