రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ | Counselling To Rowdies | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌

Published Wed, Nov 21 2018 5:46 PM | Last Updated on Wed, Nov 21 2018 5:46 PM

Counselling To Rowdies  - Sakshi

ఖమ్మంక్రైం: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం డివిజన్‌కు చెందిన రౌడీషీటర్లకు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రెహమాన్‌ నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో అల్లర్లు సృష్టించినా.. వేరే వ్యక్తులను, వర్గాలను రెచ్చగొట్టడం, ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేర ప్రవృత్తి కలిగిన వారి కార్యకలాపాలు, కదలికలపై పూర్తి నిఘా ఉంటుందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్ల వారీగా జాబితా తయారు చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement