task force police
-
బంజారాహిల్స్: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఓ వ్యభిచారం గృహంపై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేశారు. రోడ్ నెం.11లో అల్ కరీమ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకురాలు స్వాతితోపాటు ఇద్దరు యువతులు, ఓ కస్టమర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకురాలు సత్యవతి పరారీలో ఉంది. నిందితులను విచారణ నిమిత్తం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
శ్రీకాంత్ ఫ్రమ్ సీఎం పేషీ.. బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కావాలా?
సాక్షి, హైదరాబాద్: ‘నేను ముఖ్యమంత్రి పేషీలో కార్యదర్శిగా పని చేస్తున్న శ్రీకాంత్ రావును, బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కావాలా?’ అంటూ ఎర వేసి, అందినకాడికి దండుకుని పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి బారినపడిన వారిలో పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారని ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. కరీంనగర్ జిల్లా, ఇందుర్తికి చెందిన బి.కమల్ కృష్ణ గౌడ్ బీకాం మధ్యలో ఆపేశాడు. ఆపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో రిపోర్టర్‌గా పని చేశాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ముఖ్యమంత్రి పేషీ కార్యదర్శి అవతారం ఎత్తాడు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ కార్యకర్తల ఫోన్ నంబర్లు సంగ్రహించిన అతను బీసీ కమిషన్‌తో పాటు వివిధ కమిషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు ఇప్పిస్తానంటూ ఫోన్లు చేశాడు. పలువురి నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడు. ఇతగాడిపై గోపాలపురంతో పాటు జవహర్‌నగర్ పీఎస్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం సోమవారం అతడిని అరెస్టు చేసింది. పవర్ ప్లాంట్ పనుల నిలిపివేత దుండిగల్: దుండిగల్ తండా సమీపంలో చేపట్టిన రాంకీ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మున్సిపల్ అధికారులు నిలిపి వేశారు. పవర్ ప్లాంట్‌కు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ దుండిగల్ కమిషనర్ భోగీశ్వర్లు నేతృత్వంలో సోమవారం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి, సిబ్బంది జేసీబీతో బేస్మెంట్, పిల్లర్లను కూల్చివేయించారు. -
ఎర్రచందనం స్వాధీనం: ఒక స్మగ్లర్ల అరెస్టు
-
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
ఖమ్మంక్రైం: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం డివిజన్‌కు చెందిన రౌడీషీటర్లకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రెహమాన్ నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో అల్లర్లు సృష్టించినా.. వేరే వ్యక్తులను, వర్గాలను రెచ్చగొట్టడం, ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేర ప్రవృత్తి కలిగిన వారి కార్యకలాపాలు, కదలికలపై పూర్తి నిఘా ఉంటుందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్ల వారీగా జాబితా తయారు చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీరియల్ స్నాచర్..‘సినిమా’ కష్టాలు...
సాక్షి,సిటీబ్యూరో: మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడి సీరియల్ స్నాచర్‌గా మారిన ఘరానా దొంగ మీర్ అయ్యాన్ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అతను తన ముఠా తో కలిసి రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరాడు. పదకొండు నేరాల్లో 430 గ్రాముల బంగారు ఆభరణాలు లాక్కుపోయినట్లు పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్‌తో కలిసి గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘సినిమా’ కష్టాలు... మహారాష్ట్రలోని జల్గాం ప్రాంతానికి చెందిన మీర్ అయాన్ అలీ ఖాన్ అలియాస్ అబ్దుల్లా పుట్టక ముందే తండ్రిని కోల్పోయాడు. తన తొమ్మిదో ఏట తల్లి సైతం అనారోగ్యంతో మరణించింది. దీంతో అయాన్ తన మేనత్త వద్దకు చేరాడు. ఆమె పెడుతున్న బాధలు భరించలేక ముంబై పారిపోయాడు. అక్కడి వీధుల్లో తిరుగుతున్న ఇతడిని గమనించిన స్థానికులు కొలాబా ప్రాంతంలోని యాంకరేజ్ ఆర్ఫనేజ్ హోమ్‌కు తరలించారు. అక్కడే ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో హోమ్ మూతపడటంతో మళ్ళీ రోడ్డునపడ్డ అయాన్ మార్బుల్ స్టోన్స్ పరిచే పని నేర్చుకున్నాడు. ఈ వృత్తినే జీవనాధారంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో 2010లో హైదరాబాద్ వచ్చాడు. జల్సాలకు అలవాటుపడి... సిటీలో కొన్నాళ్ల పాటు ఆ పనే చేసిన అయాన్‌కు అలా వచ్చిన ఆదాయం సరిపోలేదు. జల్సాలకు అలవాటుపడటంతో ఖర్చులు పెరిగి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్న అయాన్ 2011లో సైదాబాద్ పరిధిలో తొలి స్నాచింగ్ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో చంచల్‌గూడ జైల్లో ఉండగా బోయిన్పల్లి నుంచి వాహన చోరీ కేసులో జైలుకు వచ్చిన తలాబ్‌కట్ట వాసి మహ్మద్ అహ్మద్ అలీతో పరిచయమైంది. చెరశాలలోనే జట్టు కట్టిన ఈ ద్వయం బయటకు వచ్చాక వరుసపెట్టి స్నాచింగ్స్ చేయడం మొదలెట్టింది. ఉత్తరప్రదేశ్ నుంచి నగరంలో నివసిస్తున్న హరేందర్ సింగ్‌తోనూ అయాన్‌కు పరిచ యం కావడంతో అతడూ ఈ ముఠాలో చేరాడు. కలిసి రాని ‘11’... నిత్యం బైక్‌ను డ్రైవ్ చేసే బాధ్యతలు నిర్వర్తించే అయాన్ వెనుక కూర్చుని స్నాచింగ్ చేయడానికి మాత్రం ఒకసారి అలీని మరోసారి సింగ్‌ను తీసుకువెళ్ళేవాడు. ఈ రకంగా ఈ త్రయం 2014–15ల్లో సంతోష్‌నగర్, కార్ఖానా, ముషీరాబాద్, చిలకలగూడ, మేడిపల్లి, చందానగర్, మీర్‌పేట, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, నల్లకుంట, టప్పాచబుత్ర పరిధిలో 11 నేరాలు చేసి పోలీసులకు చిక్కింది. ఈ కేసులకు సంబంధించి సంతోష్‌నగర్ పోలీసులు 2016లో అయాన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. గతేడాది ఫిబ్రవరిలో జైలు నుంచి బయటకు వచ్చిన అయాన్ కొన్నాళ్ళు ఆటోడ్రైవర్‌గా పని చేశాడు. అలా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో మళ్ళీ పాతమిత్రులతో కలిసి స్నాచింగ్స్ ప్రారంభించాడు. గతేడాది మే నుంచి లంగర్‌హౌస్, ఉస్మానియా వర్శిటీ, అంబర్‌పేట, గాంధీనగర్, మలక్‌పేట, నార్సింగి, ఉప్పల్, మేడిపల్లి ఠాణాల పరిధుల్లో 11 నేరాలు చేశాడు. 2011లో తొలిసారి అరెస్టు అయిన అయాన్.... ఆపై రెండు దఫాల్లోనూ 11 చొప్పునే స్నాచింగ్ చేసి పోలీసులకు చిక్కాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ... నిత్యం హిందీ పేపర్లు చదివే అయాన్‌కు పోలీసుల దర్యాప్తు తీరుపై అవగాహన ఉంది. అధికారులు ప్రధానంగా సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా ముందుకు వెళ్తారనే విషయం తెలుసుకున్నాడు. దీంతో తొలి రెండు స్నాచింగ్స్‌ను స్నేహితుడి నుంచి అరువు తెచ్చుకున్న వాహనంపై తిరుగుతూ చేశాడు. ఆపై తానే ఓ సెకండ్‌హ్యాండ్ వాహనం ఖరీదు చేసుకున్నాడు. దానికి నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించడంతో పాటు నిత్యం హెల్మెట్ ధరించేవాడు. వెనుక కూర్చునే అలీ, సింగ్‌లతో మాస్క్ వేయించేవాడు. చోరీలకు వినియోగించిన వాహనాన్ని సైతం తలాబ్‌కట్టలోని తన ఇంటి వరకు తీసుకువెళ్ళకుండా దూరంగా పార్క్ చేసేవాడు. ఈ హెల్మెట్ ధరించి టార్గెట్లను ఎంచుకునే నేపథ్యంలోనే రెండుసార్లు ‘తప్పు’లోకాలేశాడు. మీర్‌పేట పరిధిలో చేసిన రెండు స్నాచింగ్స్లోనూ మహిళల మెడలో పసుపు రంగులో ఉన్న నైలాన్ తాడును బంగారు పుస్తెలతాడుగా భావించి స్నాచింగ్ చేయించాడు. ఈ ఘటనల్లో పుస్తెలు మాత్రం బంగారంవి అతడికి దక్కాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నందుకే ఎనిమిది నెలల పాటు వరుసగా స్నాచింగ్స్ చేయగలిగాడు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్.. గతేడాది మే నుంచి వరుసపెట్టి పంజా విసురుతున్న ఈ ముఠా కదలికలను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జనవరిలో గుర్తించారు. తమ వాహనానికి నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించినప్పటికీ నిత్యం ఒకే ప్లేట్ వాడటంతో పోలీసులకు ఆధారం చిక్కింది. మరోపక్క సీసీ కెమెరాల్లో రికార్డు అయిన కదలికల ఆధారంగా వీరు పాతబస్తీకి చెందిన వారుగా తేల్చారు. వీటి ఆధారంగా ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్‌వర్మ, జి.వెంకట రామిరెడ్డి, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థాకుద్దీన్ తమ బృందాలతో కలిసి దాదాపు నెల రోజుల పాటు పాతబస్తీని జల్లెడపట్టారు. గురువారం వాహనంపై వస్తున్న అయాన్‌ను పట్టుకున్నారు. ఇతడి నుంచి 311 గ్రాముల బంగారం ఆభరణాలు, రూ.1.25 లక్షల నగదు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. -
అంతర్రాష్ట్ర సర్టిఫి‘కేటుగాళ్ల’ ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో: బోగస్ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శనివారం వెల్లడిం చారు. రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాలేద్ ఉప్పర్‌పల్లిలో నూర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ రకంగా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందని ఇతగాడు ఎస్సెస్సీ నుంచి పీజీ వరకు వివిధ రకాలైన నకిలీ సర్టిఫికెట్లు విక్రయించడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేవాడు. ఢిల్లీకి చెందిన విశాల్ అనే వ్యక్తి ద్వారా మహాత్మాగాంధీ కృషి విద్యాపీ(ఉత్తరప్రదేశ్), వీర్‌భద్రసింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ, భర్కతుల్లా యూనివర్శిటీ (మధ్యప్రదేశ్), బుంధేల్ఖండ్ యూనివర్శిటీ (ఉత్తరప్రదేశ్), మానవ్‌భారతి యూనివర్శిటీ (హిమాచల్‌ప్రదేశ్) పేర్లతో సర్టిఫికెట్లు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఖరీదు చేసేవాడు. అక్కడ నుంచి ఈ ధ్రువీకరణపత్రాలను విశాల్ కొరియర్లో ఖాలేద్‌కు పంపేవాడు. వీటిని సైఫాబాద్ ప్రాంతంలో లిమ్రా అటెస్టేన్స్ సంస్థను నిర్వహిస్తున్న మహ్మద్ ఉస్మాన్‌కు అప్పగించేవాడు. ఇతడు ఈ సర్టిఫికెట్లపై వివిధ రకాలైన స్టాంపులు వేసేవాడు. ఇలా పక్కాగా తయారు చేసిన సర్టిఫికెట్లను అవసరమైన వారికి రూ.40 వేల వరకు విక్రయించేవాడు. మెహిదీపట్నానికి చెందిన నిరుద్యోగి జీషాన్ అలీఖాన్ ఉద్యోగం పొందడానికి రూ.20 వేలతో నకిలీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఖరీదు చేశాడు. ఈ సర్టిఫికెట్ల ముఠాతో ఢిల్లీ, హిమాయత్నగర్లకు చెందిన షోయబ్, సబిత్లకు ప్రమేయం ఉంది. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం వలపన్ని శనివారం విశాల్, షోయబ్, సబిత్ మినహా మిగిలిన ముగ్గురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి 24 బోగస్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకుని కేసును బహదూర్‌పుర పోలీసులకు అప్పగించింది. మరోపక్క నల్లకుంట పోలీసుస్టేషన్ పరిధిలో మూడు ముక్కలాట నడుస్తున్న ప్రాంతంపై టాస్క్‌ఫోర్స్ దాడి చేసింది. నిర్వాహకుడు డి.లక్ష్మణ్‌తో పాటు 10 మందిని అరెస్టు చేసి రూ.1.51 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. నెల రోజులుగా వ్యవస్థీకృతంగా దందా నిర్వహిస్తున్న లక్ష్మణ్.. ఒక్కో గేమ్‌కు ఆడేవారి నుంచి రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.