డైట్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
అంగలూరు (గుడ్లవల్లేరు) :
జిల్లాలోని డైట్ సీట్ల భర్తీకి 223 దరఖాస్తులను స్వీకరించి నట్లు అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ(డైట్) ప్రిన్సిపాల్ జి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం నుంచి డైట్‌లో జిల్లాకు సంబంధించిన సీట్లకు ఆయన కౌన్సిలింగ్ చేపట్టారు. జిల్లాలోని 32డైట్‌లు ఉన్నాయన్నారు. వాటిలోని 2,750సీట్లలో తొలి విడతగా 1,458 సీట్లను కేటాయించారని తెలిపారు. మేనేజ్‌మెంట్ సీట్లు 530 ఉన్నాయని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఏ అభ్యర్థులకు ఏ సమయం కేటాయిస్తే ఆ సమయంలోనే కౌన్సిలింగ్‌కు రావాలని సూచించారు. వచ్చేటపుడు, ప్రొవిజినల్ ఎలాట్‌మెంట్ లెటర్, ఆన్‌లైన్ అప్లికేషన్ లెటర్, డైట్‌సెట్ ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్క్స్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్(టీసీ), 4నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు , కుల ధృవీకరణ సర్టిఫికెట్(మీ–సేవా ద్వారా తీసుకున్నవి), ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ లేదా రేష్‌కార్డు జిరాక్స్(రేషన్‌కార్డు అయితే వెరిఫికేషన్ ఆఫీసర్‌కు ఒరిజినల్ కార్డు చూపించాలి), ³హెచ్‌సీ, స్పోర్ట్, ఆర్మీ కోటా అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు ఈ కింది ధృవపత్రాలను తీసుకురావాలని కోరారు.