న్యూఢిల్లీ: క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా 19 ప్రతిష్టాత్మక న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టనున్న కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము జారీ చేసే తదుపరి ఉత్తర్వుల ఆధారంగానే ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. మే 13న నిర్వహించిన క్లాట్‌కు 54 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే పరీక్ష సందర్భంగా సాంకేతిక సమస్య లు ఎదురయ్యాయని, ఫలితాలను నిలిపి వేయాలని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని కొంద రు విద్యార్థులు పలు హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీం.. ఫిర్యాదుల పరిష్కా ర కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాల్సిం దిగా కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment