విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీలో ఎండీ హోమియో కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల 15న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ నెల 12న వర్సిటీ నిర్వహించిన ఎండీ హోమియో అన్‌లైన్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌కు అర్హులని పేర్కొన్నారు.
ప్రవేశ పరీక్షకు 134 మంది హాజరవగా, 66 మంది అర్హత సాధించారు. వివరాలకు యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
ఎండీ హోమియో సీట్లకు కౌన్సెలింగ్ రేపే..
Published Wed, Dec 14 2016 2:24 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
Advertisement
Advertisement