సాప్ట్వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ మిస్సింగ్ కేసు చిక్కుముడి వీడి 24 గంటలు గడవకముందే నగరంలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముషిరాబాద్ లో తల్లీకూతురు కనిపించకుండా పోయారు. తన భార్య స్వప్న, కూతురు శాన్వి కనిపించకుండా పోయారని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కూరగాయలు కొనేందుకని వెళ్లి వీరిద్దరూ అదృశ్యమైయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వప్న, శాన్వి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ సమీపంలోని యమునం పేట వద్ద రైలు కింద పడి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ ముషిరాబాద్ నుంచి అదృశ్యమైన స్వప్న, శాన్విగా అనుమానిస్తున్నారు.