సీపీఐ నాయకుడి భార్యపై దాడి | Unknown persons attacked on CPI leader pratap reddy wife | Sakshi
Sakshi News home page

సీపీఐ నాయకుడి భార్యపై దాడి

Published Fri, Jan 10 2014 8:36 AM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

Unknown persons attacked on CPI leader pratap reddy wife

హైదరాబాద్ : సీపీఐ రాష్ట్రా నాయకుడు, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు, రచయిత కందిమళ్ల ప్రతాప్ రెడ్డి సతీమణి సావిత్రిపై నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. రాంనగర్ డివిజన్ రిసాల కుర్షిద్జాహిలోని తన నివాసంలో రాత్రి తొమ్మిది గంటల సమయంత ఆమె వంట చేస్తుండగా బయట కాలింగ్ బెల్ మోగింది. వచ్చి తలుపు తీసేసరికి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు తమ వెంట తెచ్చుకున్న చున్నీని సావిత్రి ముఖంపై కప్పారు.

ఈ క్రమంలో తీవ్ర పెనుగులాట జరిగింది. సావిత్రి గట్టిగా కేకలు వేసి భర్తను పిలవటంతో ప్రతాప్ రెడ్డి బెడ్రూమ్ నుంచి వచ్చేసరికి దుండగులు బయటికి పరుగెత్తుకుంటూ తమ ద్విచక్రవాహనంపై పారిపోయారు. వీరు దొంగతనం కోసం వచ్చారా లేక హత్యాయత్నానికి ఒడిగట్టారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముషీరాబాద్, చిక్కడపల్లి పీఎస్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement