హైదరాబాద్ : ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్‌లో నివాసముంటున్న జహంగీర్(28) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన జహంగీర్ ఆచూకీ ఇంత వరకూ తెలియరాలేదు. బంధువుల ఇళ్లు, తెలిసిన వాళ్ల ఇళ్ల దగ్గర వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు గురువారం ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలాగే సంవత్సరం క్రితం కూడా జహంగీర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు వెతకడంతో వరంగల్‌లో అప్పుడు ఆచూకీ లభించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.