ముషీరాబాద్లోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం | Blaze guts timber depot in Musheerabad | Sakshi
Sakshi News home page

ముషీరాబాద్లోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం

Published Mon, Dec 30 2013 8:12 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

ముషీరాబాద్లోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం - Sakshi

ముషీరాబాద్లోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : ముషీరాబాద్లోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రోజు తెల్లవారుజామున  జరిగిన ఈ ప్రమాదంలో డిపోలో నిల్వ ఉంచిన కలప తగలబడుతోంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దాంతో సమీపంలోని భవనాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

ప్రమాదం జరిగి అయిదు గంటలు  గడిచినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. సుమారు 2 కోట్ల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. దాంతో స్థానికులు టింబర్ డిపోను అక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేసినా టింబర్ డిపో యజమాని మాత్రం పట్టించుకోలేదు. తరచు అగ్నిప్రమాదాలు జరగటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement