
భర్త, కుమార్తెతో స్వప్న(ఫైల్)
హైదరాబాద్: ముషిరాబాద్ నుంచి అదృశ్యమైన తల్లీకూతురు స్వప్న, శాన్వి శవాలుగా దొరికారు. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ సమీపంలోని యమునం పేట వద్ద రైలు పట్టాలపై వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమార్తెతో కలిసి స్వప్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
మూడేళ్ల కుమారుడి ఇంట్లోనే వదిలేసి 20 నెలల కుమార్తెతో కలిసి ఆమె ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తోంది. స్వప్న ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల క్రితం స్పప్నకు వివాహమైంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారని, ఎటువంటి గొడవలు పడేవారు కాదని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.