చేపల మార్కెట్ పరిసరాల్లో శుభ్రత అవసరం
నెల్లూరు రూరల్: చేపల మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాయింట్ కలెక్టర్ – 2 రాజ్‌కుమార్ సూచించారు. డైకస్‌రోడ్డు సెంటర్‌లోని చేపల మార్కెట్లో నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మార్కెట్ నిర్వహణపై వ్యాపారులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలకు దూరంగా ఉండవచ్చన్నారు. చేపలు త్వరగా చెడిపోకుండా తగు జాగ్రత్తలతో భద్రపర్చుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సీతారామరాజు, ఎఫ్డీఓలు, తదితరులు పాల్గొన్నారు.