బాలల హక్కుల సంరక్షణకు కృషి
-
జాయింట్ కలెక్టర్–2 రాజ్‌కుమార్
నెల్లూరు (దర్గామిట్ట) : బాలల హక్కుల సంరక్షణకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్–2 రాజ్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జెడ్పీ కార్యాలయంలో జిల్లాలోని సేవా సంస్థలు, బాలసదన్లు హాస్టళ్లు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. జేసీ-2 మాట్లాడుతూ బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికలు చదువు పట్ల శ్రద్ధవహిస్తూ క్రీడలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ బాలికలు ఎక్కడడైనా ఇబ్బందులకు గురైతే వెంటనే 1098, 100 నంబర్లకు కాల్ చేయాలన్నారు. తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యావతి మాట్లాడుతూ బాలల సంరక్షణకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని, బాలలకు సముచితమైన న్యాయం, న్యాయబద్ధమైన సేవలు అందిస్తామన్నారు.బాల నేరస్తులను చేరదీయడం, అనాథ బాలలకు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం విధి వంచనకు గురైన స్త్రీలకు రక్షణ కల్పించి వృత్తిలో నైపుణ్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో బాల సంరక్షణా కేంద్రాలు కోట,గూడూరు,వెంకటగిరి నెల్లూరు ప్రాంతాలలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కనక నరసారెడ్డి, సెట్నల్ పీఓ సుబ్రహ్మణ్యం, సీడబ్ల్యూసీ చైర్మన్ రమేశ్‌బాబు జిల్లా బాల సంరక్షణా అ«ర్గనైజర్ బి.సురేష్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.