JC 2 Rajkumar
-
ఎయిడ్స్ రహిత జిల్లాగా కృషి
నెల్లూరు(బారకాసు): 2030 నాటికి ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేంకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏజేసీ రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నగరంలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టౌన్హాల్లో నిర్వహించిన సభలో ఏజేసీ మాట్లాడారు. జిల్లాలో ఎయిడ్స్ వ్యాప్తి కాకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన అందరి బాధ్యత అని చెప్పారు. ఈవ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనంతరం ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం మాట్లాడుతూ ఎయిడ్స్ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశామన్నారు. అనంతరం ఎయిడ్స్‌పై పనిచేస్తున్న ఎనిమిది స్వచ్ఛందసంస్థల నిర్వాహకులకు, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వివిధ నర్సింగ్ కళాశాలలోని విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు నగరంలోని గాంధీబోమ్మ సెంటర్ నుంచి టౌన్‌హాల్ వరకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఏజేసీ జెండా ఊపీ ప్రారంభించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వహణలో జరిగిన ఈకార్యక్రమంలో ఏడీఎంహెచ్ఓ(ఎయిడ్స్,లెప్రసీ) డాక్టర్ రమాదేవి, డీటీసీఓ డాక్టర్ సురేష్‌కుమార్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, ఎన్‌ఎన్‌పీ ప్లస్ సంస్థ నిర్వాహకురాలు ధనూజ, హిజ్రాల సంఘం జిల్లా అధ్యక్షురాలు అలేఖ్య పాల్గొన్నారు. -
బాలల హక్కుల సంరక్షణకు కృషి
జాయింట్ కలెక్టర్–2 రాజ్‌కుమార్ నెల్లూరు (దర్గామిట్ట) : బాలల హక్కుల సంరక్షణకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్–2 రాజ్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జెడ్పీ కార్యాలయంలో జిల్లాలోని సేవా సంస్థలు, బాలసదన్లు హాస్టళ్లు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. జేసీ-2 మాట్లాడుతూ బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికలు చదువు పట్ల శ్రద్ధవహిస్తూ క్రీడలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ బాలికలు ఎక్కడడైనా ఇబ్బందులకు గురైతే వెంటనే 1098, 100 నంబర్లకు కాల్ చేయాలన్నారు. తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యావతి మాట్లాడుతూ బాలల సంరక్షణకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని, బాలలకు సముచితమైన న్యాయం, న్యాయబద్ధమైన సేవలు అందిస్తామన్నారు.బాల నేరస్తులను చేరదీయడం, అనాథ బాలలకు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం విధి వంచనకు గురైన స్త్రీలకు రక్షణ కల్పించి వృత్తిలో నైపుణ్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో బాల సంరక్షణా కేంద్రాలు కోట,గూడూరు,వెంకటగిరి నెల్లూరు ప్రాంతాలలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కనక నరసారెడ్డి, సెట్నల్ పీఓ సుబ్రహ్మణ్యం, సీడబ్ల్యూసీ చైర్మన్ రమేశ్‌బాబు జిల్లా బాల సంరక్షణా అ«ర్గనైజర్ బి.సురేష్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యార్థులను ఇబ్బంది పెడితే అట్రాసిటీ కేసులు
జేసీ 2 రాజ్‌కుమార్ నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో స్కాలర్‌షిప్పులపై చదువుకునే పేద విద్యార్థులను కళాశాల నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా అట్రాసిటీ కేసులు పెట్టాల్సి వస్తుందని జేసీ 2 రాజ్‌కుమార్ హెచ్చరించారు. నగరంలోని అంబేడ్కర్ భవన్లో గురువారం కళాశాల ప్రిన్సిపల్స్‌తో స్కాలర్‌షిప్పులపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నా ఎందుకు సంబంధిత శాఖకు హార్డ్‌కాపీలను ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్‌రావు మాట్లాడుతూ స్కాలర్షిప్పులకు సరిపడా నగదు ఉందని హార్డ్‌కాపీలు ఇస్తే నగదు విడుదల చేస్తామని చెబుతున్నా ఎందుకు ఇవ్వడంలేదో అర్థం కావటం లేదన్నారు. హార్డ్‌కాపీలు ఇవ్వకుండా ఉండడమే కాకుండా విద్యార్థులు ఫీజులు కట్టాలని ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లు విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. తక్షణమే ఎంత మంది ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వారికి సంబంధించిన హార్ట్కాపీలను సాంఘిక, బీసీ కార్యాలయానికి పంపాలని సూచించారు. సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు పాల్గొన్నారు. -
దేశప్రగతికి నిర్మాణాత్మక పాత్ర యువతదే
జేసీ-2 రాజ్‌కుమార్ ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు నెల్లూరు(బారకాసు): దేశప్రగతికి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుండేది యువతేనని జాయింట్ కలెక్టర్–2 ఎస్ఏ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నెల్లూరు పురమందిరంలో యువజన సర్వీసులశాఖ, సెట్నల్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను విజ్ఞాన సమపార్జనకు ఉపయోగించుకోవాలని సూచించారు. పెడద్రోవ పట్టకుండా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలని తెలిపారు. ఇంటర్నెట్ను వినోదానికి కాకుండా విజ్ఞానానికి ఉపయోగించుకుని ఉన్నతస్థాయికి వెళ్లేందుకు ప్రయత్నించాలన్నారు. లక్ష్యానికి అభిముఖంగా ప్రయాణించి గమ్యానికి చేరుకోవాలని ఈక్రమంలో కష్టాలు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం డివిజన్ స్థాయిలో వివిధ రంగాలలో యువజన సర్వీసుల శాఖ, సెట్నల్ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు జ్ఙాపికలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. విజేతలు వీరే.. కర్ణాటక సంగీతం(గాత్రం) కుమారి లక్ష్మిప్రియ, జానపద సంగీతం వి.శ్రీలత, జానపద నృత్యానికి డిమనోహర్, వక్తృత్వ పోటీలకు సంబంధించి జి.లక్ష్మీనిహారిక, గ్రూపు జానపద నృత్యంలో బాలాజీగ్రూపునకు, అలాగే జానపద గీతానికి సంబంధించి యన్ లక్ష్మీచందన, భరతనాట్యంలో భవిత విజేతలుగా నిలిచారు. కాగా కార్యక్రమ వ్యాఖ్యాతగా బుల్లితెర నటుడు శింగంశెట్టి మురళీమోహన్రావు వ్యవహరించారు. సెట్నల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, వికలాంగుల సంక్షేమశాఖ సహాయ సంచాలకు జి.నరసింహులు, ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపిల్ సాయిబాబ, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి, సెట్నల్ ఏఓ ప్రసాద్, స్వచ్ఛంద సంస్థల జిల్లా అధ్యక్షుడు ఈవీఎస్ నాయుడు పాల్గొన్నారు. -
చేపల మార్కెట్ పరిసరాల్లో శుభ్రత అవసరం
నెల్లూరు రూరల్: చేపల మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాయింట్ కలెక్టర్ – 2 రాజ్‌కుమార్ సూచించారు. డైకస్‌రోడ్డు సెంటర్లోని చేపల మార్కెట్లో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మార్కెట్ నిర్వహణపై వ్యాపారులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలకు దూరంగా ఉండవచ్చన్నారు. చేపలు త్వరగా చెడిపోకుండా తగు జాగ్రత్తలతో భద్రపర్చుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సీతారామరాజు, ఎఫ్డీఓలు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ వైద్యులు సహకరించాలి
జేసీ–2 రాజ్‌కుమార్ నెల్లూరు(అర్బన్) : జిల్లాలో విషజ్వరాలు ప్రబలకుండా గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీలు, పీఎంపీలు సహకరించాలని జేసీ–2 రాజ్‌కుమార్ కోరారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో గురువారం దోమలపై దండ యాత్ర– పరిసరాల పరిశుభ్రత అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి జ్వరం వచ్చినా గ్రామాల్లో మొదట పీఎంపీ, ఆర్ఎంపీ దగ్గరకు ప్రజలు వైద్యం కోసం వెళ్తారన్నారు. ఎలీసా పరీక్ష చేయకుండా, లక్షణాలను బట్టి డెంగీ అని నిర్ధారించకూడదని సూచించారు. దోమలు నివారణకు, పరిసరాల పరిశుభ్రత కోసం వైద్యశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు సహకరిస్తునాన్నారని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం, పీఎంపీ అధ్యక్ష, కార్యదర్శిలు శాఖవరపు వేణుగోపాల్, షేక్ సత్తార్, తెలుగునాడు పారామెడిక్స్ అసోసియేషన్ నాయకులు రత్నం తదితరులు పాల్గొన్నారు. -
మాతృభాషపై పట్టు సాధించాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జాతి సంస్కృతి, కళల వారసత్వాన్ని అందించేది భాషేనని, మాతృభాషపై పట్టుసాధించే దిశగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ 2 సాల్మన్ రాజకుమార్ పేర్కొన్నారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా తెలుగుభాషోద్యమ సమితి ఆధ్వర్యంలో మాతృభాషలో విద్యాబోధన– ఆవశ్యకతపై శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భాషా, సంస్కృతి వేరు కాదని, జాతి అస్తిత్వం, గౌరవాన్ని కాపాడేది మాతృభాషేనన్నారు. అనంతరం ఓఎస్డీ పెంచలరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుభాషకు ప్రాధాన్యమిచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలను జరపాలన్నారు. చిన్నారుల తెలుగుభాషోద్యమ సమితి ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడు గణేష్‌బాబు, నెల్లూరు జిల్లా భాషోద్యమ సమితి గౌరవాధ్యక్షుడు చలంచర్ల భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బద్దిపూడి శీనయ్య, కోశాధికారి పైడాల కొండమ్మ, కళాకారులు ఆరి విజయకుమార్, పార్వతీశం, నాగరాజు, నరసింహం, తదితరులు పాల్గొన్నారు. -
విలువలతో కూడిన విద్యనందించాలి
జేసీ–2 రాజ్‌కుమార్ నెల్లూరు(బృందావనం): విలువలతో కూడిన విద్యనందించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని జాయింట్‌కలెక్టర్–2 రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 46 మంది ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సత్కరించారు. నగరంలోని సుబేదారుపేటలోని రోమన్ క్యాథలిక్ మిషన్ కమ్యూనిటీల్లో జరిగిన కార్యక్రమానికి రాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు సామాజిక విలువలను నేర్పించాలని సూచించారు. సింహపురి మేత్రాసనం పీఠాధిపతి బిషప్ ఎండీ ప్రకాశం మాట్లాడుతూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం మాట్లాడుతూ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా క్రిస్టియన్ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరందూరు సురేంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు రాయపాటి హృదయకుమార్, నిర్వాహకులు ఏలీషాకుమార్, మోజెస్, దానం ప్రేమ్‌రాజ్, సుకన్య, స్వర్ణ వెంకయ్య, హనోక్, తదితరులు పాల్గొన్నారు. -
పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు
జేసీ 2 రాజ్‌కుమార్ నెల్లూరు(పొగతోట): జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జేసీ 2 రాజ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక రంగాల్లో రెండంకెల వృద్ధిరేటు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జీవనోపాధి కల్పించాలన్నారు. పశువులు, కోళ్లు, గొర్రల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. డీఆర్డీఏ, పశుసంవర్థక శాఖలు సమన్వయంతో పని చేసి లభ్ధిదారులు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కోళ్లు, గొర్రెల యూనిట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే కేటాయించాలన్నారు. 4500ల కోళ్ల యూనిట్లు, 475 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. కోళ్ల యూనిట్ రూ.4 వేలు, గొర్రెల యూనిట్ రూ.50 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ యూనిట్లకు సబ్సిడీ ఉండదన్నారు. 480 పశువుల యూనిట్లు మంజూరు చేశామన్నారు. యూనిట్ కాస్ట్ రూ.60 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. పశువుల యూనిట్లకు 75 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. ఈ యూనిట్లు ఎస్‌స్సీలకు మాత్రమే మంజూరు చేయాలన్నారు. అనంతరం వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, వైద్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్ కె.రంగారెడ్డి, డీఆర్‌ఆఏ పీడీ లావణ్యవేణి, పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్ పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు శిక్షణ
జేసీ–2 రాజ్‌కుమార్ నెల్లూరు(పొగతోట): పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు సంబంధించి ఎస్టీ అభ్యర్థులకు నెల రోజులు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని జేసీ–2 రాజ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానిస్టేబుల్స్, జైలు వార్డెన్ల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అర్హులైన ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు నిర్ణయించినట్లు తెలిపారు. 18 నుంచి 27 ఏళ్ల వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హులన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ అభ్యర్థులు జైల్ వార్డెన్ పోస్టులకు అర్హులన్నారు. అభ్యర్థుల ఎత్తు 167.6 సెంటిమీటర్లు, ఛాతీ గాలి పీల్చిన తరువాత 86.3 సెంటీమీటర్లు ఉండాలన్నారు. పై అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీన 200 మార్కులకు రాతపరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 11 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగినవారు ఈ నెల 6, 7 తేదీల్లో స్థానిక ఏసీసూబ్బారెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు 98499 13074, 98499 09074లో సంప్రదించాలని తెలిపారు. సెట్నెల్ సీఈఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవాలి
జేసీ–2 రాజ్‌కుమార్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రజలందరూ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాలని జేసీ–2 సాల్మన్ రాజ్‌కుమార్ అన్నారు. Mýృష్ణాపుష్కరాల నేపథ్యంలో స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్న చర్చావేదికలో మంగళవారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఈ పాస్ విధానంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ సేవలపై ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వ సేవలు, సదుపాయాలు ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్య సైతం ఆన్లైన్లో అందిస్తున్నారన్నారు. ఈ పాస్ విధానం వల్ల నిత్యావసరాల పంపిణీ, సామాజిక పింఛన్లు అందజేసే విధానం అమల్లోకి వచ్చిందన్నారు. డీఎస్ఓ ధర్మారెడ్డి, ఏపీఆన్‌లైన్ ఎస్సీఏ వంశీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బహిరంగ మలవిసర్జన సాంఘిక దురాచారం
జేసీ–2 రాజ్‌కుమార్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : బహిరంగ మలవిసర్జన సాంఘిక దురాచారమని జేసీ–2 ఆర్.సాల్మన్‌రాజ్‌కుమార్ పేర్కొన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణ పుష్కరాలను పురస్కరించుకుని స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ ఆత్మగౌరవం అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ–2 మాట్లాడుతూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను చేపట్టారన్నారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో 68 శాతం బహిరంగ మలవిసర్జనకు అలవాటు పడ్డారన్నారు. దీన్ని నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు మరుగుదొడ్లపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. తొలుత ఆత్మగౌరవం కళాజాత బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధశాఖల అధికారులు, స్వచ్ఛందసేవాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.