మాతృభాషపై పట్టు సాధించాలి
మాతృభాషపై పట్టు సాధించాలి
Published Sat, Sep 17 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జాతి సంస్కృతి, కళల వారసత్వాన్ని అందించేది భాషేనని, మాతృభాషపై పట్టుసాధించే దిశగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ 2 సాల్మన్ రాజకుమార్ పేర్కొన్నారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా తెలుగుభాషోద్యమ సమితి ఆధ్వర్యంలో మాతృభాషలో విద్యాబోధన– ఆవశ్యకతపై శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భాషా, సంస్కృతి వేరు కాదని, జాతి అస్తిత్వం, గౌరవాన్ని కాపాడేది మాతృభాషేనన్నారు. అనంతరం ఓఎస్డీ పెంచలరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుభాషకు ప్రాధాన్యమిచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలను జరపాలన్నారు. చిన్నారుల తెలుగుభాషోద్యమ సమితి ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడు గణేష్‌బాబు, నెల్లూరు జిల్లా భాషోద్యమ సమితి గౌరవాధ్యక్షుడు చలంచర్ల భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బద్దిపూడి శీనయ్య, కోశాధికారి పైడాల కొండమ్మ, కళాకారులు ఆరి విజయకుమార్, పార్వతీశం, నాగరాజు, నరసింహం, తదితరులు పాల్గొన్నారు.
Advertisement