సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షను రద్దు చేసింది. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిం చెప్పింది. అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది కీ విడుదల చేయాలని సంస్థను ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన పిటిషన్‌ను అనుమతిస్తూ తుది తీర్పు వెలువరించింది. అలాగే స్టే ఎత్తివేయాలంటూ దాఖలైన మధ్యంతర అప్లికేషన్లను కొట్టివేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022, సెపె్టంబర్ 4న నిర్వహించిన పరీక్షకు 79,898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి ‘కీ’ని విడుదల చేయలేదు.
ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపీయింగ్, ఇతర అవకతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దా ఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యా యస్థానం, తీర్పు వెలువరించే వరకు ఫలితాలను వెల్లడించవద్దని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై మరోసారి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించలేదని భావించిన న్యాయమూర్తి.. రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment