
సాక్షి, హైదరాబాద్: మరియమ్మ లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్‌గా స్పందించింది. బాధితులకు పరిహారం ఇస్తే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? అని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాకప్ డెత్ బాధ్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని అధికారులను ప్రశ్నించింది. బాధ్యులైన పోలీసులను.. విధులు నుంచి తొలగిస్తే న్యాయం చేసినట్టేనా? అని.. తీవ్రంగా స్పందించింది.
ఈ ఏడాది జూన్‌లో చర్చిపాస్టర్ బాలశౌరి ఇంట్లో దొంగతనం ఆరోపణలతో మరియమ్మను, ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్‌ను అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము.. దొంగతనం చేయలేదని చెప్పిన అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వాత వారిని తీవ్రంగా కొట్టారు. కాగా, ఎస్సై మహేష్, కానిస్టేబుల్ దెబ్బలకు తాళలేక మరియమ్మ జైలులోనే మృతి చెందింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.
ఈ క్రమంలో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. ఇప్పటికే ఎస్సై మహేష్‌తోపాటు, ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు విధుల నుంచి తొలగించారు. తాజాగా పౌరహక్కులు ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్లాయి. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు తాజాగా, సీబీఐ విచారణకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment