సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది గోపాలశర్మ ఈ పిటిషన్‌ని దాఖలు చేశారు. చట్టబద్దత లేకుండానే వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఆధార్, కులం వంటి వివరాలు అడుగుతున్నారని కోర్టుకు విన్నవించారు. వెబ్‌సైట్ ద్వారా వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని.. 15 రోజుల్లోనే వివరాలు నమోదు చేయాలంటున్నారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు సేకరించిన వివరాలు రహస్యంగా ఉంచితే తప్పేంటి అని ప్రశ్నించింది. (చదవండి: 20 దాకా ఆస్తుల నమోదు)
ధరణిలో ఆస్తుల నమోదుకు గడువు లేదని, నిరంతర ప్రక్రియ అని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆస్తుల నమోదుకు చివరి తేదీ లేదన్న ఏజీ వివరణను నమోదు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొని చెప్పాలని ఏజీకి సూచించిన హైకోర్టు.. ధరణిలో ఆస్తుల నమోదు అంశంపై విచారణను మధ్యాహ్నం 1.30 గంటలకు వాయిదా వేసింది. అలానే ల్‌ఆర్‌ఎస్‌పై విచారణని నవంబర్ 5కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment