సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ కొనసాగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లపై అర్హనత వేటు వేయాలని బీఆర్‌ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు.
వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ నేతలు పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా. ప్రతివాదుల తరఫున వాదనలు వినిపించారు జంధ్యాల రవిశంకర్. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హతపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించాము. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment