సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'మర్డర్' సినిమా విడుదలను ఆపేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి:వర్మ నోట ‘మర్డర్’పాట.. విడుదల)
కాగా నల్గొండలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా ఆర్జీవీ 'మర్డర్' సినిమా తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్, పాటలు చూస్తేనే అర్థమవుతోంది. దీంతో ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రణయ్ తండ్రి బాలస్వామి మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చిత్రాన్ని ఆపాలంటూ ఆగస్టు 6 తేదీన అమృత నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రణయ్ హత్య కేసులో తీర్పు వచ్చేవరకు 'మర్డర్' చిత్రం విడుదల నిలిపివేయాలని తీర్పునిచ్చింది. (చదవండి: రామ్‌గోపాల్ వర్మకు షాక్..‘మర్డర్’కు బ్రేక్)
Comments
Please login to add a commentAdd a comment