సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వనమా వెంకటేశ్వరావుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వనమా పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.
వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదంటూ కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై వనమా మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులకు అప్పీల్‌కు వెళ్లే వరకు స్టే విధించాని వనమా.. కోర్టును కోరారు. దీంతో, వనమా పిటిషన్‌కు హైకోర్టు కొట్టివేసింది. వనమా పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఇదిలా ఉండగా.. కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు జలగం వెంకట్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్‌తో ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment