తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో సమావేశం కావడానికి టీఆర్‌ఎస్ ప్రతినిధులుగా పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఈ నెల 11న ఢిల్లీకి వెళ్లనున్నారు.
తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో సమావేశం కావడానికి టీఆర్‌ఎస్ ప్రతినిధులుగా పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఈ నెల 11న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆరోజు ఉదయం పార్టీ శిక్షణ శిబిరాల సన్నాహక సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. శిక్షణ శిబిరాల ఉపన్యాసకులకు సూచనలిస్తారు. సాయంత్రం కేకేతో కలిసి కేసీఆర్ ఢిల్లీకి పయనమవుతారు. ఈనెల 16 నుంచి పార్టీ శిక్షణ శిబిరాలు ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.