
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో 21 మంది లోక్‌సభ సభ్యులు, పది మంది రాజ్యసభ సభ్యులుం టారు. ప్రతిష్టాత్మక కమిటీకి తనను చైర్మన్‌గా ఎంపిక చేయడం పట్ల కేశవరావు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని సీఎం చాంబర్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment