అవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములే | They are government land | Sakshi
Sakshi News home page

అవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములే

Jun 13 2017 1:35 AM | Updated on Sep 5 2017 1:26 PM

రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుటుంబీకుల భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌

కొత్త మలుపు తిరిగిన కేకే భూముల వ్యవహారం ప్రభుత్వానికి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రాథమిక నివేదిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుటుంబీకుల భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ నుంచి కొనుగోలు చేసిన 36 ఎకరాలు ప్రభుత్వ భూమేనని జిల్లా యంత్రాంగం తేల్చిచెప్పింది. ఈ భూమి కొను గోలుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనిపై కేకే వివరణ ఇచ్చిన సం గతి తెలిసిందే. ప్రభుత్వ, రెవెన్యూ యంత్రాంగాల నిరభ్యంతర పత్రాల ఆధారం గానే తాను భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నానని కొన్ని పత్రాలను చూపించి ఆయన ఈ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.

ఈ వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌పై తీసుకున్న చర్యలను ఖండించారు. ఇది ముమ్మాటికీప్రైవేటు భూమేనని నిర్ధారించుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నానని కేకే చెబుతుండగా.. మరోవైపు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం దీనికి విరుద్ధంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ భూములు 22 ఏ కింద ప్రకటించిన ప్రభుత్వ భూములని, రికార్డుల్లో కూడా అలాగే ఉందని స్పష్టం చేస్తూ రాష్ట్ర సర్కారుకు నివేదిక అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలను తీసుకోనుంది. ఈ ప్రాథమిక నివేదిక కేశవరావు కుటుంబీకులకు కొత్త కష్టాలు తెచ్చే విధంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement