సాక్షి, న్యూఢిల్లీ: బెంగళూరులో ఇటీవల జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్‌ఎస్ హాజరుకాలే దంటే తాము బీజేపీతో ఉన్నట్టు కాదని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు స్పష్టం చేశారు. 26 పార్టీలు ఒకవైపు, 38 పార్టీలు ఒకవైపు అన్న లెక్కలు రాజకీయాల్లో పనికిరావని, సిద్ధాంతపరంగా ఎవరు ఎటు ఉన్నారు అన్నది చూడాల న్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావే శంలో బీఆర్‌ఎస్ తరపున ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కేకే మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో అర్థ గణాంకాలు పనిచేయవని, రెండు రెండు నీటి బిందువులు కలిస్తే నాలుగు బిందువులు కావని కేవలం ఒక నీటి బిందువే అవుతుందన్నారు.
కూట ములు విఫల ప్రయోగాలు అని ఇప్పటికే రుజువైందని వ్యాఖ్యానించారు. ఇండియా కూట మిలో ఉంటే బీజేపీకి వ్యతిరేకం అని, లేకపోతే బీజే పీకి మిత్రులని అనుకోవద్దన్నారు. ఐదుగురు జడ్జీల విషయంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కాదంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్ తేవడం అహంకారపూరితమని కేకే మండిపడ్డారు. న్యాయమూ ర్తుల కంటే తమకే ఎక్కువ తెలుసు అన్న ధోరణిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
విభజన చట్టంలోని అంశాలపై చర్చ జరగాలి: నామా
విభజన చట్టంలోని హామీలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలు, పెండింగ్ నిధుల అంశంపై చర్చ జరగాలని ప్రతీ పార్లమెంట్ సమావేశ సమయంలో పట్టుబడుతున్నా, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సమావేశాల్లో గవర్నర్ వ్యవస్థపై కూడా చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని నామా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment