ఒక వర్గం దేవుళ్లను దూషిస్తూ..తమ మతం చాలా గొప్పదని ప్రచారం చేస్తున్న పదిమింది మత ప్రచారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రంగారె డ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక బీజేఆర్ నగర్‌లో కొందరు వ్యక్తులు ఇంటింటికి తిరుగుతూ.. ఒక వర్గం దేవుళ్లను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. తమ మతాన్ని పాటించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పదిమంది మత ప్రచారకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
దేవుళ్లను దూషిస్తూ..
Published Mon, Sep 19 2016 1:40 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement