Religious hatred
-
ట్విటర్ వేదికగా ‘కుట్ర’ కోణాలను బయటపెట్టిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా బీజేపీ వైఖరి, విధానాలపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్నది మోదీ ప్రభుత్వం కాదని, ఏడీ(అటెన్షన్ డైవర్షన్) ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం కాదు, ఇది A-D ప్రభుత్వం; Attention Diversion అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర — KTR (@KTRTRS) August 24, 2022 దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరగుతోందని ఆరోపించారు. మండిపోతున్న పెట్రో ధరల నుంచి, భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందన్నారు. దేశం కోసం, ధర్మం కోసం అనేది బీజేపీ అందమైన నినాదం మాత్రమేనని.. విద్వేశం కోసం, అధర్మం కోసం అనేది అసలు రాజకీయ విధానమని తెలిపారు. చదవండి: ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే అవకాశం? ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం. దేశం కోసం.. ధర్మం కోసం... అనేది బీజేపీ అందమైన నినాదం విద్వేశం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానం HAR GHAL JAL అన్నరు.. కానీ... HAR GHAR ZAHAR HAR DIL MEIN ZAHAR నింపే కుట్ర చేస్తున్నారు. — KTR (@KTRTRS) August 24, 2022 ‘హర్ ఘర్ జల్ అన్నారు. కానీ హర్ ఘర్ జహర్. హర్ దిల్ మే జహర్( ప్రతి ఒక్కరి మనసులో, ఇంట్లో విద్వేషం) నింపే కుట్ర చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే కుతంత్రం చేస్తున్నారు. ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారు. ద్వేషం కాదు దేశం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమని తెలుసుకోండి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టె చిల్లర ప్రయత్నం విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరు SOCIAL MEDIA ద్వారా దేశంలోని.. SOCIAL FABRIC ను దెబ్బతీసే కుతంత్రం మిత్రులారా గుర్తుంచుకోండి ద్వేషం కాదు దేశం ముఖ్యం ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యం. జై హింద్ — KTR (@KTRTRS) August 24, 2022 . -
మత విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తికి జైలుకెళ్లి కేంద్ర మంత్రి పరామర్శా?
గుంటూరు రూరల్: కర్నూలు జిల్లా ఆత్మకూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమైన వ్యక్తిని పరామర్శించేందుకు కేంద్రమంత్రి మురళీధరన్ సబ్ జైలుకు వెళ్లడం విస్మయానికి గురి చేసిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఆ సందర్భంగా కేంద్ర మంత్రి మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయన్నారు. సోమవారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో సుచరిత మాట్లాడుతూ.. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని మండిపడ్డారు. బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఆత్మకూరులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మత విద్వేషాలు రెచ్చగొడుతూ గొడవకు ప్రధాన కారకుడయ్యాడని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిపారు. అక్కడ మసీదు నిర్మాణానికి సంబంధించి అభ్యంతరాలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిలువరించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదన్నారు. అలా కాకుండా మందీమార్బలంతో మసీదు నిర్మాణం వద్దకు వెళ్లి అక్కడి వారితో గొడవకు దిగడం, నిర్మాణాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించటం లాంటి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడటం ఆమోద యోగ్యం కాదన్నారు. అదే సమయంలో పోలీసులు వెళ్లి శ్రీకాంత్‌రెడ్డిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరారన్నారు. అయినా అక్కడే తిరగడం వల్ల గొడవ మరింత పెద్దదైందన్నారు. అతడి ప్రాణాల్ని కాపాడింది పోలీసులే మసీదు నిర్మాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి శ్రీకాంత్‌రెడ్డి వాహనంపై దాడి చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి శ్రీకాంత్, అతని అనుచరులను స్టేషన్‌కు తరలించి రక్షణగా ఉండి ప్రాణాలు కాపాడారని హోంమంత్రి వివరించారు. శ్రీకాంత్‌రెడ్డి, అతడి ఐదుగురు అనుచరులతోపాటు అతడిపై దాడికి పాల్పడిన దాదాపు 70 మంది ముస్లింలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే.. కేంద్రమంత్రి మురళీధరన్ ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అనడం బాధ్యతా రాహిత్యమని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై బురద చల్లాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. చిత్తూరు ఘటనపై హోంమంత్రి ఆరా చిత్తూరులో ఎస్సీ మహిళపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే ఘటనపై విచారణ జరపాలని హోంమంత్రి సుచరిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఒక కేసు విచార ణలో పోలీసులు తనను కొట్టారన్న ఎస్సీ మహిళ ఉమామహేశ్వరి ఆరోపణలపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. -
బీజేపీ ‘ఇ–రావణులు’ను రంగంలోకి దించింది: అఖిలేష్
లక్నో: వచ్చే సంవత్సరం మొదలుకానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ‘ఇ–రావణుల’ను రంగంలోకి దించిందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికపై మత విద్వేషం చిమ్మేందుకు బీజేపీ పథకరచన చేసిందని అఖిలేశ్ చెప్పారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేందుకు బీజేపీ రావణులు సిద్ధంగా ఉన్నారని, వారి వలలో పడకుండా ఎస్పీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. సమాజ్‌వాదీ నేతలపై దుష్ప్రచారానికి బీజేపీ కంకణం కట్టుకుందని, ఎస్పీ నేతలంతా మంచి నడవడికతో మెలగాలని సూచించారు. ‘రాక్షస రాజు రావణుడి తరహాలో సోషల్ మీడియాలో అబద్ధాలు, పుకార్లను పుట్టించి, యూపీ అంతటా ప్రచారం చేసేందుకు ఇ–రావణులను బీజేపీ తీసుకొచ్చింది’అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్ వ్యాఖ్యానించారు. ‘కొందరు బీజేపీ నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ నేతలుగా చెలామణి అవుతూ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యానాలు చేస్తూ వాటికి మరింత ప్రచారం కల్పిస్తారు. ఇలాంటి వారి పట్ల ఎస్పీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అభ్యంతరకర పోస్టులను సరిచూసుకోకుండా మన కార్యకర్తలెవరూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. షేర్ చేయకండి. తప్పుడు పోస్ట్‌లపై ఎప్పటికప్పుడు పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి’ అని కార్యకర్తలకు అఖిలేశ్ సూచించారు. కొందరు అఖిలేశ్ యాదవ్ అధికారిక ట్విట్టర్ ఖాతా అంటూ ఒక నకిలీ అకౌంట్‌ను సృష్టించి, దాని ద్వారా మత విద్వేష వ్యాఖ్యానాలు, అంశాలను సోషల్ మీడియాలో ప్రచారం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా అఖిలేశ్ గుర్తుచేశారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ గత వారం ఫిర్యాదు కూడా చేసింది. ‘యూపీలో సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే అయోధ్యలో రామ మందిరం ఉన్న చోటే బాబ్రీ మసీదు నిర్మించనుంది’ అని పేర్కొన్న ట్వీట్ల స్కీన్షాట్లను ఆధారంగా చూపుతూ ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ పోలీసులకు ఫిర్యాదుచేయడం తెల్సిందే. ‘యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ యూపీలో అభివృద్ధిని గాలికొదిలేసింది. మరెన్నో సమస్యలు అలాగే ఉన్నాయి. వీటన్నింటి నుంచీ ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ నాయకత్వం ఎలాంటి దిగజారుడు పనులైనా చేస్తుంది. మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం. ఎంతటి అబద్దాలనైనా నిజాలుగా నమ్మించి జనాలను మళ్లీ ఫూల్స్ చేయాలని చూస్తారు. జాగ్రత్త’ అని అఖిలేశ్ రాష్ట్ర ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. ‘అబద్ధాలు చెప్పేసి బీజేపీ 300 సీట్లు గెలవగలిగింది. అలాంటప్పుడు ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రాష్ట్ర అభివృద్ధిని చూపించి మనం అంతకంటే ఎక్కువ సీట్లను గెలవగలం. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ 350 సీట్లను గెలుస్తుంది’ అని అఖిలేశ్ ధీమాగా చెప్పారు. -
దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..?
-
అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/విశాఖపట్నం: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గ పరిధిలోని సంతబొమ్మాళి మండలంలో మత విద్వేషాలు సృష్టించేందుకు యత్నించిన టీడీపీ నాయకులు అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. అక్కడి పాలేశ్వరస్వామి ఆలయంలో శిథిలమైన నంది విగ్రహాన్ని తొలగించి కొత్త నంది విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నాయకులు జీర్ణావస్థకు చేరిన పాత నంది విగ్రహాన్ని తీసుకొచ్చి ఆగమ శాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా పాలేశ్వరస్వామి జంక్షన్ వద్ద గల సిమెంట్ దిమ్మెపై ఈ నెల 14న గుట్టుచప్పుడు కాకుండా ప్రతిష్ఠించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ఇక్కడ దిమ్మె నిర్మించగా.. మత విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు అక్కడ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బ్యాచ్ పక్కా ప్లాన్‌తో ఆ దిమ్మెపై నంది విగ్రహాన్ని నెలకొల్పింది. ఆ తరువాత పాలేశ్వరం జంక్షన్లో ఉన్న నంది విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం జరగబోతోందంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని భావించింది. ఆలయం నుంచి పాత నంది విగ్రహాన్ని తరలించడం.. దానిని పాలేశ్వరస్వామి జంక్షన్‌లోని దిమ్మెపై ఏర్పాటు చేయడం తదితర దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డవడంతో టీడీపీ నాయకుల ప్లాన్ బెడిసికొట్టింది. ఈ కుట్రలో అచ్చెన్నాయుడు అనుచరులతో పాటు ఆయనకు సన్నిహితంగా మెలిగే టెక్కలి ఈనాడు విలేకరి వట్టికూళ్ల కీర్తికుమార్ కూడా ఉన్నారు. 22 మందిపై కేసు నమోదు : డీజీపీ రాష్ట్రవ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలేశ్వరస్వామి జంక్షన్లో శిథిలమైన నంది విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు ఉందని విశాఖ రేంజి డీఐజీ ఎల్‌కేవీ రంగారావు తెలిపారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ గ్రామ వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటికే ఒక రాజకీయ పార్టీకి చెందిన నలుగురు, ఇద్దరు ఆలయ కమిటీ సభ్యులు సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. రామతీర్థం ఘటనలో నిందితుల్ని పట్టుకునేందుకు 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించా. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ గ్రామంలో పురాతనమైన, శిథిలమైన విగ్రహాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాన్నారు. ఆలయాలపై ప్రత్యేక నిఘా విశాఖ రేంజి పరిధిలో 7,700 ఆలయాల్లో సెక్యూరిటీ గార్డులను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని డీఐజీ చెప్పారు. ఇప్పటికే 3 వేల ప్రాంతాల్లో గ్రామ రక్షక దళాలను నియమించామని, మరో 1500 మంది ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు విగ్రహాల విధ్వంసం ఘటనలను తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకున్న తీరుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ ఘటనల్లో టీడీపీ స్కెచ్ పక్కాగా అమలైనట్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. అందుకు కారణమైన సూత్రధారులు, పాత్రధారులపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సానుకూల ప్రచారం రాకుండా ఉండేందుకే ఆలయ ఘటనలను ఆసరాగా తీసుకుని ఆలజడిని రేపుతున్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే దేవాలయాల్లో విగ్రహాల ధ్వంస రచనకు పాల్పడటం, పాత ఘటనలను కొత్తగా తెరమీదకు తెచ్చి అలజడి రేపడం, ఎటువంటి ఘటనలు జరగకపోయినా జరిగినట్టు దుష్ప్రచారం చేయడం వంటి చర్యలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. విశిష్ట చరిత్ర కలిగిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతైన దురదృష్టకర ఘటన గతేడాది సెపె్టంబర్ 5న జరిగింది. ప్రజల మనోభావాలతో ముడిపడిన ఇటువంటి సున్నితమైన అంశాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరిగాయి. టీడీపీ, బీజేపీలు రంగంలోకి దిగి దేవుడి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి మతపరమైన అలజడులను సృష్టించే ప్రయత్నాలు చేయగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అడ్డుకోగలిగారు. అయినప్పటికీ వరుస ఘటనలు జరగడం, వాటిని ఆసరాగా తీసుకుని విపక్షాలు రాద్ధాంతం చేయడం తెలిసిందే. ఇలా సెపె్టంబర్ 5 తర్వాత దేవాయాలకు సంబంధించి 44 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఇప్పటికే 29 కేసులను చేధించిన పోలీసులు 81 మందిని అరెస్టు చేశారు. ఆయా కేసుల్లో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజకీయ కుట్ర కోణాన్ని గుర్తించారు. తొమ్మిది కేసుల్లో టీడీపీ, బీజేపీలకు చెందిన వారికి ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉందని గుర్తించి, 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా ఘటనల్లో అరెస్టు అయిన వారి పూర్వాపరాలను ఆరా తీస్తున్న పోలీసులు తాజాగా మరికొన్ని నిజాలను గుర్తించారు. మద్దమ్మ ఆలయ ఘటనలో నలుగురు టీడీపీ నేతలు కర్నూలు జిల్లా మద్దికెర పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దమ్మ దేవాలయంలో గతేడాది డిసెంబర్ 20వ తేదీన గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటనలో ఎనిమిది మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిలో ఒక నిందితుడు ఎస్డీ ఫక్రుద్దీన్ బాషా టీడీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. మరో నిందితుడు రామాంజనేయులు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నల్ల దాసరిపల్లి గ్రామ సర్పంచ్ పదవికి టీడీపీ మద్దతుదారుడిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. మరో నిందితుడు కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన జయరాముడు. అతని తల్లి 2019 ఎన్నికల్లో టీడీపీ నాయకుడు వైకుంఠం మల్లికార్జున్ మద్దతుతో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీ చేసింది. మరో నిందితుడు గొల్ల పెద్దయ్య టీడీపీ కార్యకర్త కావడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ కీలక నేతల పాత్రపై ఆరా తీస్తున్నారు. బుచ్చయ్య డైరెక్షన్! రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుని విగ్రహాన్ని మలినంతో అపవిత్రం చేశారంటూ ఉద్దేశ పూర్వకంగా వివిధ సామాజిక మాధ్యమాలలో టీడీపీకి చెందిన వాళ్లు తప్పుడు ప్రచారం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి పరీక్ష చేయించడంతో అది జీవ సంబంధ మలినం కాదని రిపోర్టు వచ్చింది. ఈ కేసులో వెల్లంపల్లి ప్రసాద్‌బాబు (బాబు ఖాన్ చౌదరి)ను పోలీసులు అరెస్టు చేశారు. చిటికెన సందీప్ (టీడీపీ), అడపా సందీప్ (బీజేపీ), కరుటూరి శ్రీనివాసరావులు నిందితులుగా ఉన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన చిటికెన సందీప్ టీడీపీ మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరికి వ్యక్తిగత కార్యదర్శి కావడంతో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో ఇదంతా బుచ్చయ్య చౌదరీ డైరెక్షన్లోనే జరిగిందా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పనిగట్టుకుని దుష్ప్రచారం – విశాఖ జిల్లా గోలుగొండ మండలం ఏటిగైరంపేటలో రామాలయంలోని వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ.. గతంలో ఎప్పుడో దెబ్బ తిన్న విగ్రహం తాజాగా దెబ్బతిన్నట్టు సోషల్ మీడియాలో టీడీపీ నాయకుడు పైల సత్తిబాబు, కల్లిద నరేష్‌లు తప్పుడు ప్రచారం చేయించారు. – వారిని అరెస్టు చేసిన క్రమంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి హడావుడి చేశాడు. ఈ ఘటనలో ఆయన పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వినాయకుడి విగ్రహంపై జరిగిన దుష్ప్రచారం వెనుక ఉన్న టీడీపీ నేతలు ఎవరు? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. – వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమంతుడి విగ్రహానికి చెప్పుల దండ వేయడం, కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి గోపురాన్ని ధ్వంసం చేశారని, ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారని, గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శృంగేరి శంకర మఠంలో సరస్వతి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపవిత్రం చేశారంటూ పలు ఘటనల్లో వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నేతల వెనుక ఉన్న వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. – శ్రీకాకుళం జిల్లా సోంపేటలో హనుమంతుని విగ్రహం, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఎప్పుడో దెబ్బతింటే ఇప్పుడు జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన వారి వెనకుండి కథ నడిపిన సూత్రధారుల కోసం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తుండటం గమనార్హం. -
మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏం సాధిస్తారు?
ఈ రోజు మీడియాలో బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా? రెండు కొండల పార్టీకి ఓటేస్తారా?– ఏడుకొండల బీజేపీకి ఓటేస్తరా? అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్లు వార్త వచ్చింది. ఇదే నిజ మైతే ఇది కచ్చితంగా రాజ్యాంగా నికి, చట్టానికి వ్యతిరేకం. అంతే కాదు, భారత శిక్షాస్మృతి ప్రకారం జైలుశిక్ష విధించగల నేరం. ఈ వ్యాఖ్యలు మత విద్వేషాన్ని రెచ్చగొడ్తాయి. ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తాయి. బైబిల్ చదివేవారిని అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఐపీసీ 153 (ఎ) ప్రకారం విభిన్న వర్గాల మధ్య వైషమ్యాలను పెంచడం నేరం. ఈ నేరాలకు 3 సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. లేదా ఫైన్ విధించవచ్చు. లేదా శిక్ష, ఫైన్ రెండూ విధించవచ్చు. అంతేగాదు పూజా స్థలాలలో వైష మ్యాలను పెంచే చర్యలు చేసినట్లయితే ఈ శిక్ష 5 సంవ త్సరాల వరకు విధించవచ్చు. ఇది పోలీసులే బెయిల్ ఇవ్వ గూడని నేరం. పోలీసులు తప్పనిసరిగా కేసు పెట్టాల్సిన నేరం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయకోవిదుల అభిప్రాయం తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలి. చట్ట బద్ధంగా ఇచ్చిన ఆజ్ఞను (ఆర్డరును) ఉల్లంఘించినా నేరమే. ఇక ప్రజా ప్రతినిధుల చట్టం 1951లో 125 సెక్షన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ ఎన్నికకు సంబంధించి అయినా సరే.. మతాల, జాతుల, కులాల, భాషల మధ్య వైషమ్యాలను కల్గించి, వాటి మధ్య శత్రుత్వాన్ని ద్వేషభావాన్ని పెంపొందించినట్లయితే అతనికి 3 సంవ త్సరాల వరకు శిక్ష లేదా ఫైన్ లేదా రెండింటిని విధిం చవచ్చు. ఎవరైనా సెక్షన్ 125 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం చేసినట్లు రుజువైతే వారు సెక్షన్ 8 ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయ డానికి అనర్హులు. అదేవిధంగా మత సంస్థల దుర్వినియోగ నిరోధక చట్టం 1988 ప్రకారం, ఎన్నికల్లో పోటీకి అర్హత కోల్పోతారు. బండి సంజయ్ స్టేట్మెంట్ను బీజేపీ ఖండించాలి. లేకపోతే ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యకు గురికావలసి వస్తుంది. గౌరవనీయులు జస్టిస్ ఆవుల సాంబశివరావు భారత రాజ్యాంగ వ్యవస్థ న్యాయవ్యవస్థ అనే పుస్తకంలోని లౌకిక తత్వం అనే వ్యాసంలో ఇలా వ్రాశారు.‘లౌకికత్వాన్ని ప్రతి పౌరుడు, ముఖ్యంగా ముందు కాలంలో దేశాన్ని నడిపించవలసిన యువతరం, వంట బట్టించుకోవడం అవసరం. అది లేకపోవడంతో భారత ఉపఖండం ముక్కచెక్కలయ్యింది. ఆ శకలాలలో నివసించే ప్రజలు మత పిచ్చితో, శ్లేష్మంలోని ఈగల్లాగా కొట్టు మిట్టాడుతున్నారు. దేశాన్ని ముక్కలుగా తరిగిన 1947 నాటికంటే ఇప్పుడు ఆ పిచ్చి ఏ మాత్రం తక్కువగా లేదు. హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, క్రిస్టియన్లు – ఎవరికి వారు తమ మతం, తమ సమాజం, తమ ఉనికి ప్రమాదంలో పడిపోయిందని ఆరాటపడిపోతున్నారు. ఒకళ్ళమీద మరొకరు అనుమానాలు, కక్షలు పెంచుకుంటు న్నారు. ఈ మతపిచ్చి మన ఉపఖండంలోని మూడు రాజ్యా లకే పరిమితం కాలేదు. మధ్య తూర్పు ఆసియా దేశాల్లో ఈ వెర్రి ఏ మాత్రం తక్కువగా లేదు. తమ రాజ్యాలనే మత రాజ్యాలుగా మార్చివేస్తున్నారు. ప్రజల జీవితాన్ని తారు మారు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కాక, ప్రజల్ని పేదరికం నుండి బయట పడవేసే ప్రయత్నాలు కాక, మత స్పర్థల్ని పెంచే తంత్రాల మీదనే ప్రభుత్వాల ప్రయత్నాలు కేంద్రీకృతమైనాయి. వెర్రితలలు ఇంతటితో ఆపలేదు. మత పిచ్చి మాత్రమే చాలదన్నట్లు, కులతత్వాన్ని, రెచ్చగొడుతున్నారు. సమాజం యావత్తు కులాల కింద ముక్కచెక్కలై పోతున్నది’. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం పౌరులందరికీ మత స్వాతంత్య్రపు హక్కు కల్పించారు. మనదేశంలోని ఏ వ్యక్తి అయినా తన సొంత ఆలోచన విధానాన్ని పాటించవచ్చు. తనకిష్టమొచ్చిన మతాన్ని పాటించి ఆచరించి ప్రచారం చేసుకోవచ్చు. ఏ మత వ్యవస్థలైనా, మత సంస్థలను ఏర్పాటు చేసికొని మత విషయాలను తాము సొంతంగా నడుపుకోవచ్చు. ఆస్తు లను సంపాదించుకోవచ్చు. ఏ వ్యక్తినీ కూడా మతపరమైన సంస్థలకు ఖర్చుపెట్టడం కోసం పన్ను చెల్లించమని నిర్బంధించకూడదు. ప్రభుత్వ సహాయంతో నడిచే ఏ విద్యాసంస్థలోనైనా మతపరమైన బోధనలు చేయరాదు. ఏ వ్యక్తికి కూడా ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యా సంస్థలలో మతం కారణంగా ప్రవేశం నిరాకరించరాదు. ప్రతి వ్యక్తికి అతనికి ప్రత్యేకమైన భాష, లిపి, సంస్కృతి ఉంటే వాటిని సంరక్షించుకునే అధికారం ఉంటుంది. అల్ప సంఖ్యాక వర్గాల వారు వారి సొంత విద్యాసంస్థలను నెల కొల్పి వాటిని సొంతంగా నడుపుకోవచ్చు. దీనినే లౌకిక వాదం అంటారు. రాజ్యాంగంలోని 25 నుంచి 30 అధికర ణలు ఈ విషయాలను స్పష్టం చేస్తాయి, ప్రతివ్యక్తి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని రాజ్యాం గంలోని ప్రాథమిక విధులలో పేర్కొన్నారు. ఏ మనిషి ఏ కులంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో అతని లేదా ఆమె చేతిలో ఉండదు. పంచభూతాలు సూర్యుడు, గాలి, నీరు, వాయువు, భూమి ఎవ్వరిపట్ల వివక్షత చూపవు. అంటే ప్రకృతికి అంటే పరమాత్మునికి వివక్ష ఉండదు. పరమా త్మకు ఏ కులాన్ని, ఏ మతాన్ని ఆపాదించగూడదు. ఏ పేరుతో ప్రార్థించినా చేరేది అక్కడికే. భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే ఈ విశ్వాన్ని, ఈ విశ్వంలో అన్ని మతాల వారిని, కులాలవారిని సృష్టించాడు. దీనిని అర్థం చేసుకోక స్వార్థంతో, రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని, మతాన్ని, దేవుణ్ణి వాడుకోవడం చట్టరీత్యా నేరం. దైవం దృష్టిలో అపచారం. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల మీద దాడులలో విగ్రహాలు ధ్వంసం చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర లేదా ఆయన పార్టీ హస్తం ఉంటుందని నేను అను కోవడం లేదు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నారు. తనే స్వయంగా తన ప్రభుత్వానికి అస్థిరతను ఎందుకు కల్పిస్తారు? ఎందుకు అశాంతిని, శాంతిభద్రతల సమస్య లను కలుగజేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. -జస్టిస్ చంద్రకుమార్ వ్యాసకర్త రిటైర్డ్ న్యాయమూర్తి మొబైల్ : 79974 84866 -
విలేకరిపై కేసును ఖండించిన ఐఎన్ఎస్
న్యూఢిల్లీ: మలయాళ టీవీ చానల్ ‘మాతృభూమి న్యూస్’కు చెందిన ప్రముఖ యాంకర్‌పై మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేయడాన్ని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) ఖండించింది. ఇలాంటి చర్యలతో కేరళ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించింది. ప్రజాస్వామ్య దేశంలో మీడియాపై ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛకు, స్వతంత్రంగా ఆలోచించి, మాట్లాడే సంస్కృతికి గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలని ప్రభుత్వానికి ఐఎన్ఎస్ విజ్ఞప్తి చేసింది. -
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయండి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని కర్ణాటక ప్రజలకు ప్రధానిమోదీ పిలుపునిచ్చారు. గురువారం మోదీ యాప్ ద్వారా కన్నడ ప్రజలు, బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కర్ణాటకలో అధికారం నిలుపుకునేందుకు దురుద్దేశంతో సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఎన్నికల చివరి సమయంలో ప్రజలను ప్రలోభాలకు గురిచేసే విధంగా హామీలు గుప్పించడంలో కాంగ్రెస్ నేతలు సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధపు హామీల గురించి తెలిసే దేశంలో 22 రాష్ట్రాల ప్రజలు ఆ పార్టీకి సరైన బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్‌ను దేశం నుంచి పూర్తిగా తరిమివేసే వరకు అభివృద్ధి సాధ్యం కాదన్నారు. బెంగళూరును అభివృద్ధి చేస్తే దేశాన్ని కూడా అభివృద్ధి చేసినట్లేనన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో బెంగళూరు నగరం కనీస సౌకర్యాల కొరతను కూడా అధిగమించలేక అవస్థలు పడుతోందన్నారు. కన్నడ భాషను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్న ప్రధాని త్వరలోనే పూర్తిస్థాయిలో నేర్చుకుంటానన్నారు. -
దేవుళ్లను దూషిస్తూ..
ఒక వర్గం దేవుళ్లను దూషిస్తూ..తమ మతం చాలా గొప్పదని ప్రచారం చేస్తున్న పదిమింది మత ప్రచారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రంగారె డ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక బీజేఆర్ నగర్లో కొందరు వ్యక్తులు ఇంటింటికి తిరుగుతూ.. ఒక వర్గం దేవుళ్లను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. తమ మతాన్ని పాటించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పదిమంది మత ప్రచారకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. -
యూపీలో మళ్లీ మత ఘర్షణలు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మత విద్వేషాలు చల్లారేలా లేవు. ముజఫర్ నగర్ మంటలు చల్లారకముందే.. కాన్పూర్‌లో విద్వేషాగ్ని రగిలింది. ఘటంపూర్ ప్రాంతంలో ఆదివారం చెలరేగిన అల్లర్లలో ఒకరు చనిపోగా, ఆరుగురు పోలీసులు సహా 12 మంది గాయపడ్డారు. అల్లరిమూకలు గృహదహనాలకు పాల్పడటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. భీతర్ గ్రామంలో రెండు రోజుల క్రితం ఒక ఇంటిలో దొంగతనం చేస్తున్న ఒక వర్గానికి చెందిన ఇద్దరు బాలలను గ్రామస్తులు పట్టుకుని, తీవ్రంగా కొట్టి, అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆదివారం వారిని ఆ ఊరిపెద్ద విడిపించి తీసుకువెళ్లాడు. అయితే, తీవ్రంగా కొట్టడంతో ఆ పిల్లలు చనిపోయారన్న వదంతులు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఒక వర్గం వారి ఇళ్లు, దుకాణాలు లక్ష్యంగా రాళ్లదాడులు చేశారు. పదులసంఖ్యలో షాపులకు మంటలు పెట్టారు.ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఘర్షణల్లో ఒక షాప్ యజమాని మరణించాడు. మరో మహిళ 70% కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఘర్షణలకు సంబంధించి 13 మందిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని కాన్పూర్ గ్రామీణ ఎస్పీ అనిల్ మిశ్రా తెలిపారు.