వణికిస్తున్న అంటువ్యాధులు... | Booming infections in Ranga Reddy | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న అంటువ్యాధులు...

Published Sun, Jul 10 2016 4:14 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Booming infections in Ranga Reddy


-ఏ ఇంట్లో చూసినా బాధితుల మూలుగులు!
-మలేరియా,టైఫాయిడ్,అతిసారతో అస్వస్థత
-వర్షాకాలంలో ముందస్తు చర్యలపై అధికారుల నిర్లక్ష్యం
-అస్తవ్యవస్తంగా పారిశుధ్యం..పలు చోట్ల పైప్‌లైన్ల లీకేజీలు
-జూన్ నుంచి జూలై 9వ తేదీ వరకు 164 మంది బాధితుల చేరిక

తాండూరు (రంగారెడ్డి జిల్లా)

 అంటు వ్యాధులు వణికిస్తున్నాయి. తాండూరులో ఏ ఇంట్లో చూసినా ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్, అతిసార బాధితుల మూలుగులే వినిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరు వాంతులు,వీరేచనాలు, జ్వరాలతో బాధపడుతుండటం గమనార్హం. వద్ధుల నుంచి చిన్నారుల వరకు రోగాలతో మంచాన పడుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో జ్వరాలతో బాధపడుతున రోగుల సంఖ్య పెరుగుతున్నదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యం, మురుగునీరు పారుదల వ్యవస్థతో అంటువ్యాధులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. ఏటు చూసినా ఇళ్ల మధ్య మడుగు కట్టిన మురుగు నీరు...చెత్పకుప్పలతో పరిసరాలు దుర్వాసనతో కంపు కొడుతున్నాయి. దాంతో అంటురోగాలు విజంభిస్తున్నాయి. వర్షాకాలంలో అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు కినుకువహిస్తున్నారు. ఇప్పటికే జ్వరాలతో బషీరాబాద్ మండలంలో ఇద్దరు విద్యార్థులు మత్యువాత పడ్డారు. తాండూరు పట్టణంతోచుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను రోగాలు బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో వందమందికిపైగా రోగాల బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. తాండూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. సుమారు 65వేలకుపైగా జనాభా ఉంది. వార్డులోన్లి కాలనీలతోపాటు అంతర్గత రోడ్ల పక్కన చెత్తను తరలింపు సవ్యంగా సాగటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో వ్యర్థాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నది. దోమల సమస్య ఉత్పనమవుతున్నది. అతిసార, మలేరియా, టైఫాయిడ్‌లు సోకి తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి,ప్రై వేట్ ఆసుపత్రి పాలవుతున్నారు. కాల్వలు లేకపోవడంతో ఆదర్శనగర్‌లో ఇళ్ల మధ్యనే మురుగునీరు నిలిచింది. మురుగునీరు కాల్వ నుంచి వెళ్లే తాగునీటి పైప్‌లైన్ లీకేజీతో నీరు కలుషితమవుతున్నదని స్థానికులు వాపోతున్నారు. మరోచోట మురుగునీటి కాల్వలోనే తాగునీటి పైప్‌లైన్ ఉండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కలుషితం వల్ల అంటువ్యాధులు సోకుతున్నాయని పట్టణ వాసులు వాపోతున్నారు. ఇదే ప్రాంతంలో ఇంకో చోట తాగునీటి పైప్‌లైన్ లీకేజీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ వర్షపునీరు నిలిచి తాగునీరు కలుషితమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోగుల సంఖ్య ఇలా..
గత నెల జూన్‌లో 73మంది మహిళలు,పురుషులు, 54మంది చిన్నారులు, ఈనెల ఇప్పటి వరకు 37మంది మలేరియా,టైఫాయిడ్, అతిసార బారిన పడి జిల్లా ఆసుపత్రిలో చేరారు. వీరిలో కొంతమంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఒక్కొక్క మంచంపై ఇద్దరు రోగులకు చికిత్సల అందిస్తున్నారు. ప్రై వేట్ ఆసుపత్రిలో చేరుతున్న రోగులు ఉన్నారు.
కలుషితనీరు,ఆహారమే కారణం
కలుషితనీరు,ఆహార పదార్థాలతోపాటు దోమలు, పరిసరాల అపరిశుభ్రత తదితర కారణాల వల్లనే అతిసార,టైఫాయిడ్, మలేరియా వ్యాధులు సోకుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కాచి వడబోసిన నీళ్లను సేవించాలి. వేడి పదార్థాలు తీసుకోవాలి. ప్రస్తుతం మలేరియా, టైఫాయిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అతిసార కేసులు కొన్ని నమోదు అయ్యాయి. రోగులకు చికిత్సలు అందిస్తున్నాం. కొందరు డిశ్చార్జి అయ్యారు.
-భాగ్యశేఖర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement