![Six Years Old Boy Died With Dengue Fever At Ranga Reddy District - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2019/11/16/Six-Years.jpg.webp?itok=S96t2gTP)
మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్‌లో డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతిచెందింది. అంజయ్య, పద్మ దంపతుల కుమార్తె దివ్య(6) తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా స్థానికంగా చికిత్స చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో గురువారం ఆమనగల్లులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు డెంగీ అని చెప్పారు. దీంతో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment