రంగారెడ్డి జిల్లా బుద్వేల్ గ్రామంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ గ్రామంలోని కల్లు కాంపౌండ్ వద్ద మంగళవారం వేకువజామున కమలమ్మ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. బీరు సీసాతో పొడిచి ఆపై బండరాయితో తలపై మోది హతమార్చారు. కల్లు కాంపౌండ్ వద్ద కమలమ్మ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కమలమ్మ భర్త బుచ్చిరాములుపై అనుమానంతో అతనిని అదుపులోనికి తీసుకున్నారు. కమలమ్మ తన ఇద్దరు పిల్లలతో గత కొంతకాలంగా భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. భర్తే హతమార్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.