చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన మహిళకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 9వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే... నాగోలు చెందిన కృష్ణాగౌడ్ బోడుప్పల్ ప్రాతానికి చెందిన అనితారెడ్డిలు పరిచయస్తులు. తన వ్వాపార అవసరాల నిమిత్తం 2014జూన్ 9న రూ.15 లక్షలను అప్పుగా కృష్ణాగౌడ్ నుంచి తీసుకుని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానంటూ ఒప్పంద పత్రం రాయించి ఇచ్చింది. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించమని అనితారెడ్డిని కోరగా అందుకు గాను ఐసీఐసీఐ బ్యాంకు ఉప్పల్‌కలాన్ బ్రాంచికి చెందిన రూ.15 లక్షల చెక్కును కృష్ణాగౌడ్ పేరిట జారీ చేసింది. సదరు చెక్కును ఎస్‌బీహెచ్ నాగోలు బ్రాంచిలో జమచేయగా చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ అనితారెడ్డి డబ్బులు చెల్లించకపోవడంతో కృష్ణాగౌడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 9వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు.
చెక్ బౌన్స్ కేసులో మహిళకు జైలుశిక్ష
Published Wed, Aug 17 2016 6:20 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement