Anita Reddy
-
Dr Anita Shah: ఆధ్యాత్మిక కళకూ.. ఒక చరిత్ర ఉంది!
ఆమెది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. ఆమె వృత్తీ, ప్రవృత్తీ రెండూ కళలను అధ్యయనం చేయడమే కావడం వల్ల భారతీయ చిత్రరీతుల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. మనదేశంలో విలసిల్లిన కళారూపాలు ఏయే దేశాల మ్యూజియాల్లో ఉన్నాయో తెలుసుకుని ప్రతి విషయాన్నీ గ్రంథస్తం చేస్తున్నారు. ఆమే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన డాక్టర్ అనితా షా, చిత్రకళల పరిశోధకురాలు.ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐసీఓఎమ్)లో కీలక సభ్యురాలిగా ప్రపంచదేశాల్లో పర్యటిస్తూ మ్యూజియాలజీ విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మనదేశంలో విస్తరించిన వైవిధ్యభరితమైన చిత్రకళారూపాల గురించిన సమగ్రమైన వివరాలతో ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో ఆవిష్కరించారు. అమెరికా, ఇండియాల్లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రకళ మీద సదస్సులు నిర్వహిస్తున్న అనితా షా గతంలో ఆమె భర్త భరత్ షాతో కలిసి ‘త్రెడ్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్‌లో అభివృద్ధి చెందిన ఎంబ్రాయిడరీలతో ప్రదర్శన నిర్వహించారు.రాస్తే కావ్యం... గీస్తే చిత్రం..‘‘చిత్రం అంటే సాహిత్యాన్ని కంటితో చూపించే ప్రక్రియ. నిరక్షరాస్యులకు ఒక గ్రంథసారాన్ని బొమ్మల్లో చూపించవచ్చు. చిత్రకారులు కాలానుగుణంగా మార్పులను జోడించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో దక్కనీ– హైదరాబారీ ఆర్టిస్టులు సంయుక్తంగా కృషి చేసి గోల్డెన్ కలంకారీ పెయింటింగ్స్‌కు రూపకల్పన చేశారు. ఇది పద్దెనిమిదవ శతాబ్దపు చివరి రోజుల్లో అభివృద్ధి చెందింది. కళాకారుల కళానైపుణ్యం అంతా కృష్ణుడు, గోపికల రూపాలను తీర్చిదిద్దడంలో కనిపిస్తుంది. నేను శ్రీవల్లభాచార్య వల్లభ సంప్రదాయ తత్వం పుష్టిమార్గం మీద ఎక్కువగా పని చేశాను.వల్లభాచార్య తత్వం శుద్ధ అద్వైతం, కృష్ణతత్వంతో ఉంటుంది. శైవం ప్రభావం కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంది. ఇందులో తాత్విక చింతన, పురాణాల అవలోకనమే ప్రధానంగా సాగుతుంటుంది. సద్గురువుల ప్రవచనాలు, ప్రబోధాల వల్ల అనేక ఊహాచిత్రాలకు రూపం వచ్చింది. సామాన్యులకు ఆరోగ్యకరమైన, ఆచరణీయమైన దైనందిన జీవనశైలిని కూడా పౌరాణిక కథల ద్వారానే వివరించేవారు. తల్లి బిడ్డను లాలనగా నిద్రలేపడం, బిడ్డకు స్నానం చేయించి దుస్తులు ధరింపచేసి చక్కగా అలంకరించడం వంటివన్నీ కృష్ణుడు, యశోద పాత్రల ద్వారా బొమ్మల్లో రూపుదిద్దుకున్నాయి.చిత్రకళలో కృష్ణతత్వం..మన చిత్రకళ, శిల్ప కళ అన్నీ చరిత్ర, పురాణేతిహాసాల ఆధారంగానే అభివృద్ధి చెందాయి. సామాజిక మార్పులను ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. భాగవత పురాణాల ప్రభావం ఉత్తరాదిలో ఎక్కువ. కాబట్టి ఉత్తరాది చిత్రకళలు ఎక్కువగా కృష్ణతత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కృష్ణుడు ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యుడే. ప్రతి సంఘటనను కృష్ణుడితో అన్వయించుకుంటారు.ముస్లిం ఆర్టిస్టులు హిందూచిత్రాలు..నా తాజా రచన కలర్స్ ఆఫ్ డివోషన్ పుస్తకం వెనుక ఏడేళ్ల శ్రమ ఉంది. ఇది పాఠకుల సాంస్కృతిక, సామాజిక దృష్టి కోణాన్ని విస్తృతపరుస్తుందని చెప్పగలను. హిందూ పురాణాల ఆధారంగా చిత్రాలకు రూపకల్పన చేసిన వారిలో ముస్లిం చిత్రకారులున్నారు. ఆదిల్ షా స్వయంగా సరస్వతీ మాతను పూజించాడు. ఇలాంటి అనేక సామరస్య సహజీవన ఆధారాలు మనప్రాచీన చిత్రాల్లో దొరుకుతాయి. భారతీయ చిత్రకళలో సాంస్కృతికప్రాముఖ్యతను తెలియచేశాను.గతంలో ‘విజిటర్స్ టూ సౌత్ ఇండియన్ మ్యూజియమ్స్– మ్యూజియోలాజికల్ కాంటెక్ట్స్ అండ్ విజిటర్ స్టడీ’ పేరుతో పుస్తకం తెచ్చాను. చిత్రకళారీతులతోపాటు వాటిని చిత్రించిన వస్త్రనైపుణ్యాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. మన చిత్రకళారీతులన్నీ ఒకచోట గుదిగుచ్చి లేక΄ోవడం దురదృష్టకరం. ఒక్కొక్కటి ఒక్కోచోట ఉండడంతో ఒక సమగ్రమైన స్వరూపం రావడం లేదు. అందుకే మ్యూజియాల్లో ప్రదర్శనలో ఉన్న కళాఖండాల ఫొటోలు, వివరాలతో రచనలు చేస్తున్నాను. ఇదే నా పని’’ అని వివరించారు డా. అనితాషా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
హస్తం గూటికి జెడ్పీ సారథులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా, తాండూరు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ అధిష్టానానికి షాక్‌లిస్తున్నారు. ఓ వైపు లోక్‌సభ ఎన్నిక లు దగ్గర పడుతుండగా, మరో వైపు గులాబీ పార్టీ కి గుడ్ బై చెప్పేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కారు దిగి హ స్తం గూటికి చేరుకోగా, తాజాగా వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి శుక్రవారం గాందీభవన్ వేదికగా హస్తం గూటిలో చేరనున్నారు. ముందుగా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్‌మున్షీ, మంత్రుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆమెతో పాటు కుమారుడు రినీష్ రెడ్డి కూడా పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిరువురినీ పార్టీలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి.. తాను మాత్రం త్వరలో చెవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ కండువా వేసుకోనున్నట్టు చెబుతున్నారు. సునీత దారిలోనే అనిత.. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌ను కలిశారు. అధికారికంగా పార్టీ కండువా కప్పుకోక పోయినా.. పార్టీ మార్పుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కృష్ణారెడ్డి కోడలు, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా త్వరలో కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎప్పుడు పార్టీ లో చేరనున్నారనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 20న జెడ్పీ సర్వసభ్య సమావే శం ముగిసిన తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. కాగా, అనితారెడ్డి మరోసారి జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సారి మహేశ్వరం నుంచి కాకుండా కందుకూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత జెడ్పీ పీఠాన్ని మళ్లీ ఆమెకే కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
వైద్యురాలిగా.. ప్రజా ప్రతినిధిగా..
సాక్షి, మహేశ్వరం: ప్రజా ప్రతినిధిగా, వైద్యురాలిగా సేవలు అందిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి. వైద్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ‘ఆర్ట్’ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేపు (జూలై 1న) ‘డాక్టర్స్ డే’ సందర్భంగా అనితారెడ్డిపై ప్రత్యేక కథనం. కర్ణాటకలో వైద్య విద్య పూర్తిచేసిన తీగల అనితారెడ్డి కొంత కాలం నగరంలో ఓవైసీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న దక్కన్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రెండేళ్లు మహబూబ్‌నగర్‌లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2010లో ఆమె మామ, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రోత్సాహంతో దిల్‌సుఖ్‌నగర్‌లో టీకేఆర్ ఐకాన్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఉచితంగా సేవలు అందించారు. వైద్య సేవ చేస్తూనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని 2016లో ఆర్కేపురం కార్పొరేటర్‌గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓటమి చెందినా నిరుత్సాహ పడకుండా మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ కార్యాక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో మహేశ్వరం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొంది జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనా తన ఆస్పత్రిలో వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ఆర్ట్(అనితారెడ్డి తీగల) ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేశారు. ఇవే కాకుండా ఉమెన్ ఇంప్రూవ్మెంట్ శిబిరం, స్వచ్ఛ భారత్, మొక్కల నాటడం తదితర స్వచ్ఛ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తాను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉన్నా వైద్య వృత్తిని వీడనని, ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటానని అనితారెడ్డి చెబుతున్నారు. -
మామా.. కోడలా..?
మామా.. కోడలా.. ఎవరు పోటీచేస్తారు? తీగల తప్పుకుంటారా.. అనిత బరిలో దిగుతారా? మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. స్థానిక శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డికి దీటుగా ఆయన కోడలు అనితారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుండడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా చీలిపోయిన పార్టీలో కొత్త పవర్ సెంటర్ ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన తీగల కృష్ణారెడ్డి రాష్ట్రంలో మారిన సమీకరణల నేపథ్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఇప్పటికే పార్టీని వెన్నంటి నిలిచిన ముఖ్యనేతలకు ఈ పరిణామం మింగుడు పడలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన తమను కాదని తీగలకు ప్రాధాన్యం పెరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన కొత్త మనోహర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన కప్పాటి పాండురంగారెడ్డిలు తీగల చేరికను బాహాటంగానే వ్యతిరేకించారు. ఈ మేరకు వైరివర్గాలుగా మారిన సీనియర్లను సమన్వయపరిచేందుకు అధిష్టానం కప్పాటిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవితో సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది. గ్రూపులకు ఫుల్స్టాప్ పడిందని హైకమాండ్ భావిస్తున్నాక్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికివారుగానే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో తీగల అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోతే తమకు న్యాయం జరుగుతుందనే భరోసా ఇద్దరిలోనూ ఉంది. ఇదిలావుండగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సొంత కోడలు నుంచే తీవ్ర పోటీ ఎదురవుతున్నట్లు అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది. మామ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతానని ఆమె స్పష్టం చేస్తుండడం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడం గులాబీ శ్రేణులను అయోమయంలో పడేస్తోంది. వయోభారం దృష్ట్యా మామకు టికెట్ నిరాకరిస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలనే అంశాన్ని ఆమె అంతర్గతంగా తెరమీదకు తెస్తున్నారు. తమ కుటుంబానికి గాకుండా మరొకరు టికెట్ ఎగురేసుకుపోకుండా ఈ ఎత్తుగడ వేసినట్లు రాజకీయవర్గాల విశ్లేషిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనే మనసులోని మాటను మామతో అనితారెడ్డి ఇప్పటికే వెల్లడించారని, ఆయన మాత్రం కోడలు సూచనను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీచేస్తానని తెగేసి చెప్పినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. సబితను ఢీకొనే శక్తి తనకు ఉందని భావన మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సారి మహేశ్వరం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో బరిలో దిగడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నియోజకవర్గంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఈ పరిణామాన్ని కూడా అనితారెడ్డి ఉపయోగించుకుంట్నుట్లు కనబడుతోంది. సబితను ఢీకొనడం మహిళగా తనకు కలిసివస్తుందనే అంచనా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళగా ప్రజల్లోకి వెళితే సానుకూల స్పందన లభిస్తుందని, ఇది విజయతీరాలవైపు తీసుకెళుతుందని ఆమె సన్నిహితుల వద్ద అంటున్నారు. ఆర్ట్ ఫౌండేషన్‌తో ముందుకు.. టికెట్టు విషయం పక్కనపెడితే అనితారెడ్డి తీగల(ఆర్ట్) ఫౌండేషన్ పేరిట అనితారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, శస్త్రచికిత్సలు, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధి పెంపొందించేందుకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మామ కృష్ణారెడ్డితోపాటు పాల్గొంటూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మామ, కోడలు మధ్య టికెట్ విషయంతో అంతర్గతంగా పోరు నడుస్తున్న తరుణంలో ఎవరికి టికెట్ వస్తుందోననే పార్టీ శ్రేణులు చర్చింకుంటున్నాయి. ఈ ఇరువురు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని టీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఆర్ట్ ఫౌండేషన్‌తో ముందుకు.. టికెట్టు విషయం పక్కనపెడితే అనితారెడ్డి తీగల(ఆర్ట్) ఫౌండేషన్ పేరిట అనితారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, శస్త్రచికిత్సలు, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధి పెంపొందించేందుకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మామ కృష్ణారెడ్డితోపాటు పాల్గొంటూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మామ, కోడలు మధ్య టికెట్ విషయంతో అంతర్గతంగా పోరు నడుస్తున్న తరుణంలో ఎవరికి టికెట్ వస్తుందోనని పార్టీ శ్రేణులు చర్చింకుంటున్నాయి. ఈ ఇరువురు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని టీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
చెక్ బౌన్స్ కేసులో మహిళకు జైలుశిక్ష
చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన మహిళకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 9వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే... నాగోలు చెందిన కృష్ణాగౌడ్ బోడుప్పల్ ప్రాతానికి చెందిన అనితారెడ్డిలు పరిచయస్తులు. తన వ్వాపార అవసరాల నిమిత్తం 2014జూన్ 9న రూ.15 లక్షలను అప్పుగా కృష్ణాగౌడ్ నుంచి తీసుకుని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానంటూ ఒప్పంద పత్రం రాయించి ఇచ్చింది. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించమని అనితారెడ్డిని కోరగా అందుకు గాను ఐసీఐసీఐ బ్యాంకు ఉప్పల్‌కలాన్ బ్రాంచికి చెందిన రూ.15 లక్షల చెక్కును కృష్ణాగౌడ్ పేరిట జారీ చేసింది. సదరు చెక్కును ఎస్బీహెచ్ నాగోలు బ్రాంచిలో జమచేయగా చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ అనితారెడ్డి డబ్బులు చెల్లించకపోవడంతో కృష్ణాగౌడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 9వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు.