వికారాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బంజారాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన 'జాగో బంజారా' ముగింపు సభలో ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అభివృద్ధి దిశగా నడిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బంజారాలకు ఆయన హామీ ఇచ్చరు. ఈ సభకు మంత్రులు చందూలాల్, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.