పెళ్లై మూడు సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదని అత్తింటివారు వేధిస్తుండటంతో మనస్తాపం చెంది సావిత్రి(20) అనే వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా) : పెళ్లై మూడు సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదని అత్తింటివారు వేధిస్తుండటంతో మనస్తాపం చెంది సావిత్రి(20) అనే వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మహేశ్వరం మండలం తుక్కుగూడలో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.