
మహేశ్వరం: ముందు వెళ్తున్న డీసీఎం వాహానాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇం జినీర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని తుక్కుగూడ ఔ టర్ రింగ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం చో టు చేసుకుంది. పహాడీషరీఫ్ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ ప్రా ంతానికి చెందిన కిరణ్(35) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
మైసిగండిలో ఓ ఫంక్షన్‌కు హజరయ్యేందుకు తన సాంత్రో కారులో భార్య, బంధువులతో కలిసి వెళ్తున్నాడు. మార్గమధ్యలో తుక్కుగూడ ఔటర్‌పై ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య అనురాధ, బంధువు జంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ఔటర్ సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తర లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని బయటకి తీస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment