మహేశ్వరం: తెలంగాణ బంద్‌లో భాగంగా మండల కేంద్రంలో టీఆర్‌ఎస్, టీజేఏసీ, సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అంబేద్కర్- జగ్జీవన్ రామ్ చౌరస్తా నుంచి ర్యాలీగా వచ్చి ఎంపీడీఓ సమా వేశం హాలులో మన ఊరు-మన ప్రణాళి రూపకల్పనపై జరుగుతున్న అవగాహన సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులు చేసేదేమి లేక సమావేశాన్ని కొంతసేపు నిలి పివేశారు.కార్యక్రమంలోటీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రా మకృష్ణ, టీఆర్‌ఎస్ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, రాజేష్ నాయక్,సంజయ్, అలీ,బాలయ్య, తడకల యాదయ్య, అంజనేయులు, రవి, సలీంఖాన్, మునాఫ్, సీపీఎం మండల కార్యదర్శి దత్తునాయక్, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి యాదగిరి, టీఆర్‌ఎస్, టీజేఏసీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కందుకూరులో..
కందుకూరు: మండల పరిషత్ కార్యాలయంలో మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక అనే అంశంపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం ప్రారంభించిన కొద్ది సేపటికే నిలిచిపోయింది.
ఉదయం 11 గంటలకు మండల పరిషత్ సమావేశపు హాల్‌లో మండల ప్రత్యేకాధికారి దుర్గయ్య అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా సీపీఎం నేతలు సమావేశాన్ని అడ్డుకుని నిలిపివేశారు.
దీంతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి దుర్గయ్య వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గ్రామాల్లో వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు.