సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ చాలెంజ్‌లో భాగంగా మరొక విద్యార్థినికి సహాయం అందింది. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి స్నేహితుడు రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం బధిర విద్యార్థిని అర్చనకు రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అర్చన 9వ తరగతి చదువుతోంది. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న అర్చన పుట్టుకతో బధిరురాలు. ఆమెకు హియరింగ్ మెషీన్ కోసం రాజేశ్వర్‌రెడ్డి ఆర్థిక సాయం చేశారు. అర్చనకు చేయూతనందించిన రాజేశ్వర్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment