మెదక్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరన్‌రావుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒక చాలెంజ్ విసిరారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్‌రావును కౌన్సిలర్‌గా గెలిచి చూపించాలంటూ సవాల్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే రఘునందన్ సిద్ధిపేటలో రఘునందన్ కౌన్సిలర్‌గా గెలవాలన్నారు.
రఘునందన్ కౌన్సిలర్‌గా పోటీకి దిగుతానంటే ఒక కౌన్సిలర్‌తో రాజీనామా చేయిస్తానని, సత్తా ఏంటో చూపించాలన్నారు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈ క్రమంలోనే బీజేపీపై కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు.
నీ రాజీనామాను ఆమోదింప జేస్కో.. చూస్కుందాం
ముందు మెదక్ ఎంపీకి రాజీనామా చేసి నీ సత్తా ఏంటో చూపించాలని ప్రతి సవాల్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ‘నువ్వు రాజీనామా చేసి ఆమోదింప చేసుకుంటే అప్పుడు చూద్దాం మెదక్‌లో బీజేపీ గెలుస్తుందో.. బీఆర్‌ఎస్ గెలుస్తుందో’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు రఘునందన్‌రావు.
Comments
Please login to add a commentAdd a comment